Skip to main content

విద్యార్థులకు తమ లక్ష్యంపై.. స్పష్టత ఉండాలి

‘ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను చూస్తే.. ఏ కోర్సు చదివిన విద్యార్థులైనా సంబంధిత రంగంలో ఉద్యోగాలు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాని విద్యార్థులు దూరదృష్టితో ఆలోచించకపోవడం, తమ అర్హతకు తగిన కోర్సుల గురించి అన్వేషించకపోవడమే ప్రధాన సమస్యగా మారింది’ అంటున్నారు ఐఐటీ-గువహటి కొత్త డెరైక్టర్ ప్రొఫెసర్.టి.జి.సీతారామ్. ఐఐఎస్సీ-బెంగళూరులో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ.. ఇటీవలే ఐఐటీ-గువహటి డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ టి.జి.సీతారామ్‌తో గెస్ట్ కాలమ్...
లక్ష్యం.. స్పష్టంగా :
విద్యార్థులు ముందుగా తమ లక్ష్యం ఏంటి? అనే విషయంలో స్పష్టత తెచ్చుకోవాలి. దానికి అనుగుణంగా ఆ లక్ష్యాన్ని చేరుకునే కోర్సుల గురించి అన్వేషించాలి. ముఖ్యంగా విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సుల్లో చేరాలి. అలాచేస్తే ఏ కోర్సు చదివినా.. ఉన్నత స్థానాలు అందుకోవడం ఖాయం. ప్రస్తుతం అన్ని కోర్సులకు ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా అవకాశాలకు కొదవలేదు. కేవలం ఒకటి రెండు కోర్సుల గురించే ఆలోచిస్తూ.. వాటిలో ప్రవేశం లభించలేదని నిరుత్సాహపడకూడదు.

ఉన్నత విద్య దిశగా..
ఏ కోర్సులో చేరిన విద్యార్థులైనా.. ఉన్నత విద్య దిశగా దూరదృష్టితో ఆలోచిం చాలి. దీర్ఘకాలిక ప్రణాళిక వేసు కోవాలి. తక్షణ ఉద్యోగం అనేది ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి కొన్ని కోర్సులకే అందుబాటులో ఉందని గుర్తించాలి. ఈ కోర్సుల విద్యార్థులు కూడా బ్యాచిలర్ డిగ్రీతోనే క్యాంపస్ నుంచి కంపెనీల్లో అడు గుపెట్టినా.. భవిష్యత్తు కెరీర్ పరంగా ఉన్నత స్థానాలు అందుకోవడం కష్టమే. కాబట్టి ఏ కోర్సు విద్యార్థులైనా.. కనీసం మాస్టర్ డిగ్రీ చేసే విధంగా కెరీర్ ప్లానింగ్ చేసుకోవాలి. సైన్స్, ఆర్ట్స్ వంటి కోర్సుల్లో చేరిన విద్యార్థులు పీహెచ్‌డీ స్థాయి ఆలోచనతో అడుగులు వేయాలి. అప్పుడే కెరీర్ పరంగా మరింత ప్రయోజనం చేకూరుతుంది.

సమూల మార్పులు..
మన విద్యా విధానంలో పాఠశాల స్థాయి నుంచే బోధన పద్ధతులు మారాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హైస్కూల్, సీనియర్ సెకండరీ స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, ఇన్నోవేషన్ దృక్పథాన్ని పెంచేలా కరిక్యులంలో మార్పులు చేయాలి. ఇదో నిరంతర ప్రక్రియలా సాగాలి. ఇలా పాఠశాల స్థాయి నుంచి పీజీ కోర్సుల వరకూ.. బోధన విధానంలో సమూలమార్పులు రావా లి. ముఖ్యంగా ఐసీటీ ఆధారిత విద్యా విధానా న్ని అందుబాటులోకి తేవాలి. ఫలితంగా విద్యార్థులకు రియల్ టైమ్ నైపుణ్యాలు సొంతమవుతాయి.

ఉద్యోగాలిచ్చే విద్య..
బ్యాచిలర్ డిగ్రీ, ఆపై స్థాయి కోర్సుల్లో ఉద్యోగ నైపుణ్యాల విధానాన్ని అవలం బించాలి. అప్పుడే విద్యార్థుల్లో జాబ్ రెడీ స్కిల్స్ పెరుగుతాయి. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్‌లు ఇండస్ట్రీ వర్గాలతో కలిసి పని చేయాలి. విద్యా ర్థులకు క్షేత్ర నైపుణ్యాలు పెంపొందించే విధంగా సదరు కంపెనీల్లో ఇంటర్న్‌షిప్స్, ప్రాక్టికల్ వర్క్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఫలితంగా రియల్ టైమ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ముఖ్యంగా ఇంజ నీరింగ్, సైన్స్ కోర్సుల్లో ఇలాంటి విధానం చాలా అవసరం.

స్కిల్ డెవలప్‌మెంట్ :
అకడమిక్‌గా రియల్ టైమ్ నైపుణ్యాలు అందించేలా చర్యలు తీసుకుంటూనే.. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టాలి. ఇందుకోసం అకడమిక్-ఇండస్ట్రీ వర్గాల భాగస్వామ్యం ఎంతో కీలకం. ఆయా రంగాల్లో అమల్లోకి వస్తున్న కొత్త విధానాలు, టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా ఇన్‌స్టిట్యూట్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహించాలి. వీటిని కూడా పాఠశాల స్థాయి నుంచే అమలు చేస్తే విద్యార్థులకు మరింత మేలు చేకూరుతుంది.

మౌలిక సదుపాయాల కొరత :
స్కిల్ డెవలప్‌మెంట్, ఐసీటీ వంటి విధానాల అమలుకు కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరత ఉన్న మాట వాస్తవమే. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అందిపుచ్చుకోవచ్చు. తమ సమీపంలోని ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లను సంప్రదించి వారి సహకారం పొందొచ్చు. ఇప్పుడు దేశంలోని పలు ఐఐటీ లు తమ సమీప ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ఈ తరహా చేయూతనిస్తున్నాయి. ఐఐటీ-గువహటి ఔట్‌రీచ్ యాక్టివిటీస్ పేరుతో ఈశాన్య ప్రాంతాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లకు సహకారం అందించేలా పలు కార్యకలాపాలు రూపొందించాం. +2 విద్యార్థులు ఐఐటీ-గువహటి క్యాంపస్‌ను సందర్శించి ఇక్కడి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్‌ను ఇప్పటికే పలు ఐఐటీలు అమలు చేస్తున్నాయి. అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్స్‌టెన్షన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది.

ఆసక్తికి ప్రాధాన్యం :
విద్యార్థులు తమ కెరీర్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదేసమయంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిసారించాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకం. ఇంటర్ విద్యార్థులు అధిక శాతం మంది లక్ష్యం ఇంజనీరింగ్, మెడికల్. వీటితోపాటు మరెన్నో ఉన్నత అవకాశాలు, ఉత్తమ కెరీర్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. సైన్స్‌లోనే ఉన్నత స్థానాలకు చేర్చే ఇన్‌స్టిట్యూట్‌లు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో అడుగుపెడితే ఉజ్వల భవిష్యత్తు ఖాయం.

గివ్ బెస్ట్.. గెట్ బెస్ట్ :
విద్యార్థులు ‘గివ్ బెస్ట్.. గెట్ బెస్ట్’ దృక్పథం అలవర్చుకోవాలి. ఏ కోర్సులో చేరినా అందులో బెస్ట్‌గా రాణించేలా కృషిచేయాలి. తమ ప్రతిభను బయ టికి తీస్తే.. కచ్చితంగా ప్రతిఫలం పొం దడం ఖాయం. ఆసక్తి లేకుండా చదివితే పీజీ స్థాయికి చేరుకున్నా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు.
Published date : 26 Aug 2019 04:42PM

Photo Stories