Sushant Verma: ఇస్రో సైంటిస్టుగా సిరిసిల్ల కుర్రాడు
సిరిసిల్లకు చెందిన మంచికట్ల సుశాంత్‌వర్మ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో సైంటిస్టుగా ఉద్యోగం సాధించారు. సుశాంత్‌వర్మ ప్రాథమిక విద్య కరీంనగర్ కేంద్రీయ విద్యాలయంలో పూర్తి చేశారు. వివేకానంద కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ పూర్తికాగానే సుశాంత్‌వర్మ మెరిట్ విద్యార్థిగా ఇస్రోలో సైంటిస్టుగా ఉద్యోగం సాధించాడు.
చదవండి: Vallur Umamaheswara Rao: ఇస్రో శాస్త్రవేత్తకు సన్మానం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో సైంటిస్టుగా నియమితులైన సుశాంత్‌వర్మ చిన్నప్పటి నుంచి పరిశోధనలపై ఆసక్తి కనబరిచేవారు. సుశాంత్ తల్లి సుధారాణి బోయినపల్లి మండలం వర్ధవెల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండగా.. తండ్రి రాజేశం సిరిసిల్ల మున్సిపల్ మెప్మా విభాగంలో కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. సుశాంత్‌వర్మ సైంటిస్టుగా ఇస్రోలో ఉద్యోగం సాధించడంపై తల్లిదండ్రులు సుధారాణి, రాజేశం సెప్టెంబర్ 28న సంతోషాన్ని వ్యక్తం చేశారు.
చదవండి: Anantapuram: ప్రొఫెసర్ కు ఏటా ఉత్తమ ఆచార్యుల పురస్కారం