Anantapuram: ప్రొఫెసర్ కు ఏటా ఉత్తమ ఆచార్యుల పురస్కారం
ఇస్రో పరిశోధనల్లో దిట్ట
సాక్షి ఎడ్యుకేషన్: ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) నేతృత్వంలోని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రాన్ని ఎస్కేయూలోని ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా ప్రొఫెసర్ కె.రాంగోపాల్ వ్యవహరిస్తున్నారు. వాతావరణంలో దుమ్ము, ధూళి, ఆర్థ్రత, వర్షపాతం, కాలుష్యం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ఇస్రోకు సమాచారం చేరవేసేలా నిరంతరం శ్రమిస్తున్నారు. సీడీసీ డీన్‌గా, పాలిమర్ సైన్సెస్ విభాగాధిపతిగా, పీఆర్వోగా అదనపు బాధ్యతలూ నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటి వరకూ 172 పరిశోధన పత్రాలను అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రచురించారు. ఆయన పర్యవేక్షణలో 17 పీహెచ్‌డీలు, ఆరు ఎంఫిల్ డిగ్రీలు ప్రదానమయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో 70కి పైగా సెమినార్లకు హాజరయ్యారు. 10 జాతీయ స్థాయి సెమినార్లను, 6 డీఎస్టీ ఇన్‌స్పైర్ క్యాంపులను నిర్వహించారు. వాతావరణ శాస్త్రానికి సంబంధించిన 8 అంతర్జాతీయ ప్రచురణలను వెలువరించారు. జాతీయ పరిశోధన సహకారం కోసం స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ (తిరువనంతపురం), ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (అహమ్మదాబాద్) పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.
Aditya L1 Mission: మరో మూడు రోజుల్లో సూర్యుడి చెంతకు ఆదిత్య... బడ్జెట్ ఎంతంటే..!
అనంతపురం: విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రొఫెసర్లకు ఏటా ఉత్తమ ఆచార్యుల పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ నెల 5న గురుపూజోత్సవం సందర్భంగా పురస్కారాల ప్రదానానికి అర్హులైన వారి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఎస్కేయూ పరిధిలో ఇద్దరు, జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో ఇద్దరేసి ప్రొఫెసర్లను పురస్కారాలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారి వివరాలు...
ఎస్కేయూలో ప్రొఫెసర్లు
కె.రాంగోపాల్, ఏవీ రమణ
జేఎన్‌టీయూ(ఏ)లో ప్రొఫెసర్లు