Skip to main content

Prof Jagadeeswara Rao: ‘విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు ప్రాధాన్యత’

ఎచ్చెర్ల క్యాంపస్‌: విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని శ్రీకాకుళం రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుట్‌ ఐటీ) ఎస్‌ఎంపురం క్యాంపస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు అన్నారు.
Priority on skill development among students

 శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌గా న‌వంబ‌ర్‌ 24వ తేదీతో మూడేళ్ల టెర్మ్‌ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం డైరెక్టర్‌కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి సత్కరించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటీలో ప్రతిభావంతమైన గ్రామీణ ప్రాంతాలకు చెందిన పే ద విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరిట్‌ మా ర్కులు సాధించిన ఈ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ లక్ష్యంగా ట్రిపుల్‌ ఐటీ విద్య కొనసాగుతుందని అన్నారు.

చదవండి: Prof KC Reddy: ‘విద్యా విధానంలో మార్పులు గమనించాలి’

రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సు, నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు మంచి ప్యాకేజీలతో క్యాంపస్‌ డ్రైవ్‌ లో ఎంపికవుతున్నారని, మరో పక్క ఉన్నత విద్యలో, ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో రాణిస్తున్నారని తెలిపారు.

భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ క్యాంపస్‌లో శ్రీకాకుళం నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఎల్‌.సుధాకర్‌బాబు, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, అకడమిక్‌ డీన్‌ మోహన్‌కృష్ణ పాల్గొన్నారు.

Published date : 18 Nov 2023 02:04PM

Photo Stories