State Skill Development and Training Department: పాలిటెక్నిక్ సిలబస్‌ను ఏటా అప్‌గ్రేడ్ చేయాలి
Sakshi Education
సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ పోటీలకనుగుణంగా ఏటా పాలిటెక్నిక్ విద్యార్థుల సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ అన్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ కేంద్ర కార్యాలయంలో జూలై 6న పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థపై సురేష్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. సిలబస్ అప్‌గ్రేడ్‌కు నియమించిన కమిటీలో జాతీయ స్థాయి నిపుణులకు చోటు కల్పించాలన్నారు.
చదవండి: career after polytechnic: పాలిటెక్నిక్‌తో.. అద్భుత అవకాశాలు
మైదుకూరు, బేతంచర్ల, గుంతకల్లులో కొత్తగా మంజూరు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వసతుల కల్పన, భవన నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం కోసం క్యాబినెట్ నోట్‌ను సిద్ధం చేయాలని సూచించారు. సాంకేతిక విద్య శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి, జేడీ పద్మారావు, సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు పాల్గొన్నారు.
Published date : 07 Jul 2023 05:41PM