New course: హైదరాబాద్ ఐఐటీలో కరాటే.. కోర్సుగా అందుబాటులోకి
ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతోందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఇవి విద్యార్థుల్లో నిరాశ, నిస్పృహలకు కారణమవుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. మానసిక, శారీరక దారుఢ్యం వారికి అత్యవసరమని, ఇందుకు ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ కూడా సూచిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఐఐటీ.. తమ విద్యార్థులకు కరాటేను కోర్సుగా అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు ఐఐటీ ఉన్నతాధికారి తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తి స్థాయి కోర్సును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరాటే కోర్సును పూర్తి చేసిన వారికి ఒక క్రెడిట్ ఇస్తారు. విద్యార్థి ఏదో ఒక సెమిస్టర్‌లో దీన్ని తీసుకోవచ్చు. కోర్సులో భాగంగా విద్యార్థులు 14 గంటల పాటు కరాటే క్లాసులకు హాజరవ్వాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఐఐటీలో ఇప్పటికే 400 మంది కరాటే నేర్చుకుంటున్నారు. విద్యార్థులంతా ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తితో పాటు, అధికారుల ఎదుట ప్రదర్శన ఇచ్చారు. స్పందన బాగుంటంతో కోర్సుగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Department of School Education: ఉపాధ్యాయ సీనియారిటీపై కసరత్తు
Click here for more Education News