Telangana: ఈసారికి ‘ఇంజినీరింగ్’ లేనట్టే!
అదేరోజు నిర్మల్ సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఉమ్మడి జిల్లాకు జేఎన్టీయూ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అది ఎక్కడ ఉండాలో మంత్రి నిర్ణయిస్తారని చెప్పారు. ఈ విద్యాసంవత్సరమే తరగతులు ప్రారంభమవుతాయని అప్పట్లో అధికార పార్టీవర్గాలూ పేర్కొన్నాయి. కానీ.. ఇంతవరకు ఆ ఊసే లేకపోవడం నిరాశ కలిగిస్తోంది.
చదవండి: AICTE: దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా.. బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ కాలేజీలు/ సీట్లు వివరాలు ఇలా..
కొత్తగా రెండు ప్రారంభం..
జేఎన్‌టీయూహెచ్ ఆధ్వర్యంలో తాజాగా రెండు కొత్త కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జి ల్లా పాలేరు, మహబూబాబాద్‌లో ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించనున్నారు. ఒ క్కోచోట సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (డేటాసైన్స్), ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఈ ఐదు బ్రాంచీలు మంజూరయ్యాయి.
ఒక్కో బ్రాంచీకి 60సీట్ల చొప్పున కాలేజీకి మొత్తం 300సీట్లు కేటాయించారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ విడత ద్వారా కొత్త కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇక రెండేళ్ల క్రితమే వనపర్తి, సిరిసిల్లలో జేఎన్టీయూ కాలేజీలు ప్రారంభించారు. ఇప్పటికే జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్‌లో జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలు నిర్వహిస్తోంది.
చదవండి: B Tech Admissions: బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి అవకాశం.. వీరికి మాత్రమే
ఇక్కడ అవసరం..
ఇంటర్ పూర్తి కాగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు వెళ్తున్నారు. హైదరాబాద్‌లాంటి దూరప్రాంతాలకు వెళ్లి చదవాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. స్థానికంగా డిగ్రీలో కూడా ఉపాధినిచ్చే ప్రత్యేక కోర్సులు లేకపోవడం, పీజీ కాలేజీ కూడా అందుబాటులోకి రాక తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
ఇక సాఫ్ట్‌వేర్ సంస్థలే జిల్లాల బాట పడుతున్న ప్రస్తుత తరుణంలో స్థానికంగా ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వస్తోంది. సీఎం కేసీఆర్ జిల్లాకు మంజూరు చేస్తున్నట్లు ఇచ్చిన హామీ మేరకు త్వరలో కళాశాల ప్రారంభమయ్యేలా చూడాలన్న డిమాండ్ పెరుగుతోంది.