B Tech Admissions: బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి అవకాశం.. వీరికి మాత్రమే
Sakshi Education
కమాన్‌పూర్: మంథని జేఎన్‌టీయూలో సింగరేణి అధికారులు, ఉద్యోగుల పిల్లలకు కేటాయించిన బీటెక్ కోర్సులో ప్రవేశాలకు ఆగస్టు 14న చివరి అవకాశమని ఆర్జీ–3 జీఎం తెలిపారు.
కళాశాలలో అధికారుల పిల్లలకు 14, ఉద్యోగుల పిల్లలకు 12 సీట్లు కేటాయించామని, మైనింగ్‌లో 6, సివిల్‌లో 6, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 6, కంప్యూటర్ సైన్స్‌లో 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఒకటి చొప్పున సీట్లు ఉన్నాయని తెలిపారు. 14న కళాశాలలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
చదవండి:
Career Opportunities After B.Tech: బీటెక్ తర్వాత పయనమెటు... ఉన్నత విద్య లేక ఉద్యోగమా?
Published date : 10 Aug 2023 04:10PM