‘ఎల్‌పీయూనెస్ట్’ ద్వారానే లవ్లీ వర్సిటీ ఇంజనీరింగ్ ప్రవేశాలు
Sakshi Education
జలంధర్: ఈ విద్యా సంవత్సరంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ బీటెక్ ప్రవేశాలను కేవలం ‘ఎల్‌పీయూనెస్ట్-2016’ ప్రవేశపరీక్ష ద్వారా మాత్రమే చేపడతామని ఆ యూనివర్సిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ పరీక్షను ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 113 నగరాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు చేపడతామని పేర్కొంది. ఇది ఒక్క ప్రవేశ పరీక్ష మాత్రమే కాదని... స్కాలర్‌షిప్‌ల కోసం ప్రతిభ, అర్హత కలిగిన విద్యార్థులను కూడా ఇదే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని తెలిపింది.
Published date : 19 Feb 2016 01:45PM