Skip to main content

ITIలో మిగులు సీట్ల భర్తీకి నేటి నుంచి కౌన్సెలింగ్‌

కంచరపాలెం: జిల్లాలోని 3 ప్రభుత్వ, 29 ప్రైవేటు ఐటీఐల్లో మిగుల సీట్ల భర్తీకి ఆగ‌స్టు 3, 4 తేదీల్లో కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ జె.శ్రీకాంత్‌ తెలిపారు.
ITI
ITIలో మిగులు సీట్ల భర్తీకి నేటి నుంచి కౌన్సెలింగ్‌

ఆన్‌లైన్‌లో 2,908 మంది దరఖాస్తు చేసుకోగా 2,544 మంది మాత్రమే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకుని కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారని పేర్కొన్నారు. అభ్యర్థుల ఫోన్‌కు సమాచారం పంపించినట్లు తెలిపారు. ఆగ‌స్టు 3న 1 నుంచి 1069 ర్యాంకు వరకు, ఆగ‌స్టు 4న 1070 నుంచి 2,544 ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.

చదవండి:

Fake Universities: ఆ 20 వర్సిటీలు నకిలీవి.. నకిలీ వర్సిటీలు ఇవే

Govt ITIలో 3176 సీట్లు మిగులు

NEP 2020: పక్కాగా జాతీయ విద్యావిధానం అమలు

Published date : 03 Aug 2023 04:02PM

Photo Stories