NEP 2020: పక్కాగా జాతీయ విద్యావిధానం అమలు
Sakshi Education
బిజినేపల్లి: భారతదేశ విద్యావిధానంలో అనేక మార్పులతో జాతీయ విద్యా విధానం– 2020 తీసుకువచ్చారని, దీని అమలుకు జాతీయ నవోదయ విద్యాలయ సమితి పక్కాగా చర్యలు తీసుకుంటుందని ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ తెలిపారు.
జూలై 28న మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో జాతీయ విద్యా విధానం అమలుపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం– 2020లో భాగంగా 5వ తరగతి వరకు మాతృభాష లేదా స్థానిక భాషను బోధనా మాధ్యమంగా ఉపయోగిస్తారని, 8వ తరగతి నుంచి సంస్కృతం, విదేశీ భాషలకు కూడా ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. త్రిభాషా సూత్రం ప్రకారం విద్యార్థులందరూ తమ పాఠశాలల్లో మూడు భాషలను నేర్చుకోవాలని, ఆ మూడింటిలో కనీసం రెండు జాతీయ భాషలు ఉండాలని చెప్పారు. సమావేశంలో నవోదయ విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ జానకిరాములు, అధ్యాపకులు భాస్కరాచారి పాల్గొన్నారు.
చదవండి:
Teachers: ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి
Pradhan Mantri Rashtriya Bal Puraskar Awards: బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published date : 29 Jul 2023 03:36PM