Skip to main content

IT Research Centers: ఏర్పాటుకు ముందుకొచ్చిన బడా సంస్థలు ఇవే...

పరిపాలన రాజధాని కానున్న విశాఖపట్నం ఐటీ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)కి కేంద్రంగా మారనుంది.
IT Research Centers
వీసీ ప్రసాదరెడ్డికి లేఖను ఇస్తున్న రామ్‌ప్రసాద్‌

ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లోని ఎకరం విస్తీర్ణంలో ఇంక్యుబేషన్ సెంటర్‌తో పాటు ఆర్‌ అండ్‌ డీ సెంటర్లను కూడా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) ఏర్పాటు చేయ నుంది. మొదటి దశలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.19.75 కోట్లతో ఇంక్యుబేషన్ సెంట ర్‌ నిర్మించనున్నారు. దీనిని ఏయూ భాగస్వా మ్యంతో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిం ది. ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ (ఎల్‌వోఐ)ను ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డికి ఎస్‌టీ పీఐ డైరెక్టర్‌ జీసీవీడీ రాంప్రసాద్‌ జనవరి 28న అంద జేశారు. దీనిని దశలవారీగా విస్తరిస్తారు. రానున్న ఐదేళ్లలో పూర్తిస్థాయిలో ఇంక్యుబేషన్ సెంటర్‌తో పాటు ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ కూడా ఏర్పాటు చేయ నున్నారు. ఇందులో ఆర్‌ అండ్‌ డీ యూనిట్లను నెలకొల్పేందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్, శాంసంగ్‌ సంస్థలు ఇప్పటికే ప్రాథమికంగా అంగీకరించినట్లు సమాచారం. ఆపిల్‌ సంస్థతోనూ కేంద్ర ఎలక్ట్రాని క్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికా రులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.

విద్యార్థులకు ఉపయోగం

ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేషన్ సెంటర్‌తోపాటు ఆర్‌ అండ్‌ డీ సెంటర్ల ఏర్పాటు వల్ల ఇక్కడి విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులు సొంతంగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. చదువుకుంటున్న సమయంలో ఏదైనా అనుమానం వస్తే, నేరుగా వెళ్లి ప్రాక్టికల్‌గా పరిశీలించి నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కూడా సులభతరంగా మారుతుంది. పరిశోధన రంగంలో నూతన పోకడలను విద్యార్థులు వెంటనే అధ్యయనం చేసే వెసులుబాటు కలుగుతుంది.

ముఖ్యమంత్రి మాటలే స్ఫూర్తి

ఏదైనా సబ్జెక్టులో సందేహం వస్తే ప్రొఫెసర్ల దగ్గరకు వెళ్లి అడిగినంత సులభంగా ఇండస్ట్రీకి కూడా వెళ్లి తెలుసుకునే వెసులుబాటు విద్యార్థికి ఉండాలి. ఇదే సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచన. పాశ్చాత్య దేశాల తరహాలోనే విద్యార్థులకు చదువుకుంటున్న సమయంలోనే ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ఉండటం ద్వారా విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే ఉపాధి లభిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం.
– ఆచార్య ప్రసాదరెడ్డి, ఏయూ వీసీ
చదవండి:

Startups: టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖపట్నం

Startups: స్టార్టప్‌లకు ప్రత్యేక పోర్టల్

‘వి హబ్’ స్టార్టప్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి కేటీఆర్

Published date : 29 Jan 2022 12:45PM

Photo Stories