Startups: స్టార్టప్‌లకు ప్రత్యేక పోర్టల్
Sakshi Education
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) రెండవ పాలసీ విడుదల సందర్భంగా రాష్ట్రంలో అంకుర పరిశ్రమల(స్టార్టప్) కోసం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సెప్టెంబర్ 16న ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది.
పాలసీ విడుదల సందర్భంగా టాస్క్– మెంటార్ సంస్థ, డేటా ఫర్ పాలసీపై యూఎన్ డీపీ సంస్థ, టీ సాట్–ఇక్ఫాయ్ యూనివర్సిటీ మధ్య వివిధ అంశాలకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదిరాయి. గ్రామీణ ఈ–స్టోర్ల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి మంత్రి కె.తారకరామారావు అవార్డులు అందజేశారు. టీఫేజ్‌ను ఫోటానిక్ వ్యాలీ కార్పొరేషన్ ప్రారంభించగా, ఐటీ రంగానికి అందించిన సేవలకు గాను జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీ, సెజ్, ఎస్‌టీపీఐ, అమ్ చామ్, హైసియా, నాస్కామ్ ప్రతినిధులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు.
Published date : 17 Sep 2021 02:59PM