Engineers Day: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో వేడుకలు
సాక్షి ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ విద్యార్థులందరూ క్రియేటర్సేనని బెంగళూరులోని యూఆర్ రావ్ సాటిలైట్ సెంటర్, ఇస్రో ఆర్ అండ్ క్యూఏ మెకానికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ హెడ్ మహేందర్ పాల్ సింగ్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో శుక్రవారం ప్రఖ్యాత ఇంజినీరు, భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Gurukul Students for Wrestling: జిల్లా స్థాయి రెజ్లింగ్ కోసం ఎంపికైన గురుకుల విద్యార్థులు
ఈ సందర్భంగా మహేందర్ పాల్ సింగ్ మాట్లాడుతూ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, రవాణా రంగం, తయారీ రంగం, వ్యవసాయం, ఆటో మొబైల్.... ఇలా ఏ రంగం తీసుకున్నా అందులో ఇంజినీర్ల పాత్రే ఎక్కువగా ఉంటుందన్నారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో డాక్టర్ అనిల్‌కుమార్ టెంటు మాట్లాడుతూ విద్యార్థులు వారి ఆలోచననలను స్టార్టప్స్‌గానో, కంపెనీలతో అసోసియేట్ అవ్వడమో చేసి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే వినూత్న ఆలోచనలు చేసే ఇంజినీర్లకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.
Government Scholarship Scheme: విద్యార్థుల ప్రతిభకు ఎన్ఎంఎంఎస్ పథకం
విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ కమ్యూనికేషన్, టెక్నాలజీలను అప్‌డేట్ చేసుకోవాలన్నారు. వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్స్‌డేను పురస్కరించుకుని విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్‌పోలు ఆకర్షించింది. ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులు అందజేశారు.