Skip to main content

NSS: ఉత్తమ ‘ఎన్ ఎస్‌ఎస్‌’ ఆఫీసర్‌గా సీనియర్‌ అధ్యాపకుడు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామ వాసి డాక్టర్‌ పాములపాటి అశోక్‌రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్ ఎస్‌ఎస్‌ యూనిట్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా పురస్కారానికి ఎంపికయ్యారు.
NSS
ఉత్తమ ‘ఎన్ ఎస్‌ఎస్‌’ ఆఫీసర్‌గా సీనియర్‌ అధ్యాపకుడు

అశోక్‌రెడ్డి కృష్ణా జిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో సీనియర్‌ అధ్యాపకుడిగా, ఎన్ ఎస్‌ఎస్‌ యూనిట్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఎన్ ఎస్‌ఎస్‌లో జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికయినట్లు సెప్టెంబర్‌ 17వ తేదీన కేంద్ర యువజన క్రీడా శాఖ నుంచి సమాచారం అందిందని కళాశాల ప్రెసిడెంట్‌ జి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. పురస్కారాన్ని సెప్టెంబర్‌ 24వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్‌రెడ్డి అందుకోనున్నారు. రూ.1.50 లక్షల నగదుతోపాటు ట్రోఫీ, మెడల్, సర్టిఫికెట్‌లను అందజేయనున్నారు. అశోక్‌రెడ్డి 2011లో రెడ్‌క్రాస్‌ నుంచి ఉత్తమ సేవా పురస్కారం, 2012, 2015, 2019లలో రాష్ట్ర ప్రభుత్వ సేవా పురస్కారం, 2013, 2018లలో జేఎన్ టీయూ (కాకినాడ) నుంచి ఉత్తమ సేవా పురస్కారాలు సైతం అందుకున్నారు.

చదవండి: 

National Teachers Award: 44 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డుల ప్రదానం

Best Teacher Awards: 48 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

Published date : 20 Sep 2021 12:49PM

Photo Stories