Basara IIIT Admissions 2022-23 : బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలోని నిర్మల్ జిల్లా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 2022–23 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
టీఎస్ ఆన్‌లైన్ ద్వారా జూలై1 వ తేదీ నుంచి జూలై 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపికైన వారి వివరాలను జూలై 30న ప్రకటిస్తారు. పదవ తరగతి గ్రేడ్ పాయింట్ యావరేజ్, ప్రతీ సబ్జెక్టులో అభ్యర్థి పొందిన గ్రేడ్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఏపీ, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలు, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు సూపర్ న్యూమరీ సీట్లు కేటాయిస్తారు. వివరాల కోసం www.rgu kt.ac.in లేదా www.admissions.rgukt.ac.in వెబ్‌సైట్లకు లాగిన్ అవ్వొచ్చని బాసర్ ఐఐఐటీ అధికారులు తెలిపారు.
Published date : 01 Jul 2022 07:39PM