Skip to main content

YSR Engineering College : వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు అదనపు సీట్లు

Additional seats for YSR Engineering College   Principal Acharya C. Nagaraju of YSR Engineering College

ప్రొద్దుటూరు : స్థానిక వైఎస్సార్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (యోగివేమన యూనివర్సిటీ)కు అదనంగా 130 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిందని కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సి.నాగరాజు తెలిపారు. కళాశాలలో ఉన్న ఆరు కోర్‌ బ్రాంచ్‌లకు అదనంగా ప్రతి విభాగానికి 20 చొప్పున, మెటలర్జీ విభాగానికి 30 సీట్లు చొప్పున మొత్తం 130 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మే 20వ తేదీన ఏఐసీటీఈ కమిటీ వారు వర్చువల్‌ పద్ధతిలో కళాశాలను తనిఖీ చేశారని తెలిపారు. కళాశాలలో అన్ని మౌలిక వసతులు అనగా ఫ్యాకల్టీ, బోధనేతర సిబ్బంది, ప్రయోగశాలలు, గ్రంథాలయం, విద్యార్థుల ప్లేస్‌మెంట్‌, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, కళాశాల భవనాలు, కళాశాల ప్రాంగణం తదితర అంశాలను ఏఐసీటీఈ నిబంధనలకు లోబడి ఉన్నాయని గుర్తించారన్నారు. ఈ మేరకు 2024–25 సంవత్సరం నుండి కళాశాలకు అదనపు సీట్లు మంజూరు చేశారని తెలిపారు. కళాశాలకు అదనపు సీట్లులమంజూరుపై ప్రధానాచార్యులతోపాటు కళాశాల డీన్‌ ఆఫ్‌ ఫ్యాకల్టీ ఆచార్య కేవీ రమణయ్య, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Also Read: IIT Madras B.Tech program in Artificial Intelligence and Data Analytics

Published date : 15 Jun 2024 08:48AM

Photo Stories