Skip to main content

Success Story: 50 లక్షల ప్యాకేజీతో శభాష్‌ అనిపించుకున్న మధుర్‌... ఎలా సాధించాడో తెలుసుకోండిలా...

ప్రస్తుత రోజుల్లో నాలుగంకెల ఉద్యోగం వస్తే చాలు హ్యాపీగా బతికేయొచ్చు. కానీ, అలాంటి జాబ్‌ దొరకడం కూడా కష్టం అని కొందరు అనుకుంటారు. జీతం ఎంతైనా ఐ డోంట్‌ కేర్‌ మనల్ని కంపెనీలు సెలక్ట్‌ చేసుకోవడం కాదు మనమే కంపెనీలని ఎంచుకోవాలని మరికొందరు అనుకుంటారు.
Madhur Rakheja

ఇలానే అనుకున్నాడు ఓ బీటెక్‌ విద్యార్థి. కాగ్నిజెంట్, అమెజాన్‌  లాంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా వాటిని పక్కన పెట్టాడు. కొడితే కుంభస్థలాన్ని కొట్దాలిరా అనుకున్నాడో ఏమో మైక్రోసాఫ్ట్‌ లో 50 లక్షల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ కొట్టి అందరి చేత శభాష్‌ అనిపించాడు. అతడే మధుర్‌ రఖేజా.

చ‌దవండి:  కోట్ల ఇళ్లులు ఖాళీ... ఎటు చూసినా ఘోస్ట్‌ సిటీస్‌...
ఓ దుకాణదారుడి కొడుకు తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలల కన్నాడు. వాటి కోసం అంతే శ్రమించాడు. పట్టు వదలక క్యాంపస్‌ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్‌ లాంటి ప్రఖ్యాత కంపెనీలో రూ.50 లక్షల జాబ్‌ కొట్టి అనుకున్నది సాధించడమే గాక తన తల్లిదండ్రులను గర్వించేలా చేశాడు మధుర్‌ రఖేజా. అతను యూపీఈఎస్‌ స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్ సైన్స్‌ నుంచి ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో స్పెషలైజేషన్‌ తో కంప్యూటర్ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో (బీటెక్‌) పూర్తి చేశాడు. యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ డెహ్రాడూన్‌ లోని ఓ మల్టీడిసిప్లినరీ విశ్వవిద్యాలయం.

చ‌దవండి: ఒకే ఒక ఓటు... అబాసుపాలైన ట్రంప్‌
తన పయనం గురించి మధుర్‌ మాట్లాడుతూ.. టెక్నాలజీ అంటే నాకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే ప్రజల జీవితాలను మార్చగల సామర్థ్యం దానికి ఉంది. అంతటి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది కనుకే అలాంటి ప్రత్యేకమైన కోర్సును ఎంచుకున్నాను. అప్‌ స్ట్రీమ్‌ పెట్రోలియానికి సంబంధించి నాకు ఒకతను చెప్పాడు. కంప్యూటర్‌ సైన్స్‌లో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో స్పెషలైజేషన్‌ ఉందని నాకు అప్పుడే తెలిసింది. అందుకే దాన్ని ఎంచుకున్నా... అని చెబుతాడు.
మొదట తాను కొన్ని కంపెనీల జాబితాను తయారు చేసుకున్నాడు. అందులో మైక్రోసాఫ్ట్‌ కూడా ఉంది.

చ‌దవండి: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

మొదటగా ఇతరుల ఇంటర్వ్యూ అనుభవాలను చదవడంతో పాటు ఇంటర్వ్యూకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఎంపిక ప్రక్రియకు సిద్ధమైనట్లు మధుర్‌ చెబుతాడు. మైక్రోసాఫ్ట్‌తో పాటు, అమెజాన్, ఆప్టమ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌తో పాటు మరిన్ని వాటికి దరఖాస్తు చేసుకుని తాను అనుకున్న లక్ష్యం చివరికి మైక్రోసాఫ్ట్‌ ద్గగర ఆగిందని అంటాడు మధుర్‌.

Published date : 07 Jan 2023 06:36PM

Photo Stories