రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల కార్యాలయం మార్చి 20న నిర్వహించిన National Means Cum-Merit Scholarship (NMMS) ఫలితాలను జూలై 4న విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
NMMS పరీక్ష ఫలితాలు విడుదల
ఫలితాల కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లేదా తమ కార్యాలయ వెబ్‌సైట్ ‘https://www.bse.ap.gov.in’ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని వివరించారు. కాగా, గతంలో మాదిరిగా కాకుండా లక్ష్యానికి అనుగుణంగా జాతీయ ఉపకార వేతనాలు సాంఘికంగా, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావులు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులకు ధన్యవాదాలు తెలిపారు.