Skip to main content

Republic Parade: దేశానికి అన్నపూర్ణగా ఏపీ... రిపబ్లిక్‌ పరేడ్‌కు ప్రబలతీర్థం ఎంపిక

జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు.. ఈసారి ఆంధ్రప్రదేశ్‌ శకటం ఎంపికైంది. అనేక రాష్ట్రాల పోటీ మధ్యలో ఏపీ శకటం ప్రబల తీర్థం పరేడ్‌కు ఎంపికైంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు మొత్తం 17 శకటాలు ఎంపికయ్యాయి.

కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో.. సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ శకటం ఈ అవకాశం దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ కార్యాలయం వెల్లడించింది.
తెలంగాణకు దక్కని చోటు...
ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మకర సంక్రాంతి సందర్భంగా వీటిని ప్రదర్శిస్తారని.. సంప్రదాయానికి అద్దం పట్టే  విధంగా ప్రబల తీర్థం శకటం ఉందని తెలిపింది. గ్రీన్‌ హరిత విప్లవానికి ఇది ఉదాహరణగా పేర్కొంది. ఏపీ దేశానికి అన్నపూర్ణ, రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా అభివర్ణించింది.

చ‌ద‌వండి: దేశంలోనే టాప్‌లో ఏపీ... స్వచ్ఛ జల్‌ సే సురక్షలో రెండో స్థానం

prabha

కాగా విలువైన సంస్కృతికి నిలయం ఆంధ్రప్రదేశ్‌ వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌కు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తుంది. దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు అవకాశం వచ్చింది. 
రైతే రారాజు...
రైతే రారాజు అనే ఇతివృత్తంతో రూపొందించిన శకటం.. ప్రభల తీర్థం అని రాజ్యసభ ఎంపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కోనసీమ ప్రబల తీర్థం ఎంపికైందని, 400 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్న సంస్కృతికి ప్రబల తీర్థం ఒక నిరద్శనమని పేర్కొన్నారాయన.

Published date : 23 Jan 2023 02:55PM

Photo Stories