Republic Day 2024 Chief Guest: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్..
రెండు రోజుల పర్యటనలో భాగంగా మాక్రాన్ నేడు భారత్‌కు చేరుకుంటారు. మాక్రాన్ నేరుగా రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయంలో గురువారం ల్యాండ్ అవుతారు.
వివరాల ప్రకారం.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మాక్రాన్ గురువారం భారత్‌కు చేరుకుంటారు. జైపూర్ విమానాశ్రయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మోదీతో కలిసి మాక్రాన్ జైపూర్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. అలాగే, రాంబాగ్ ప్యాలెస్‌లో మాక్రాన్ కోసం ప్రైవేటు డిన్నర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
Richest Persons: ప్రపంచంలో టాప్ 10 కుబేరులు వీరే.. వారి సంపాదన ఎంతంటే..
రోడ్ షో..
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు నేతలు ట్రిపోలియా గేట్‌కు కాలినడకన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జైపూర్‌లో ఇద్దరు నేతలు రోడ్ షో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన తర్వాత మాక్రాన్ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొంటారు.