Republic Day: ఏపీ శకటానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు
Sakshi Education
భారత 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శకటానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది.
![Union Minister of State for Defense Ajay Bhatt presenting award AP Information Department JD Kiran Kumar honored at Republic Day event AP Tableau Secures Third Place in People’s Choice Category AP Republic Era and Cultural Performances](/sites/default/files/images/2024/02/01/ap-tableau-secures-1706759325.jpg)
కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్అగర్వాల్, ఏపీ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ గణతంత్ర శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు తృతీయ బహుమతి లభించింది.
పీపుల్ ఛాయస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటం మూడో స్థానంలో నిలిచింది. డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఆంధ్రప్రదేశ్ శకటం అకట్టుకుంది. కాగా తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం, ద్వితీయ స్థానంలో ఉత్తర ప్రదేశ్ చెందిన శకటం నిలిచాయి.
Bharat Ratna: ‘భారత రత్న’ అందుకున్న ప్రముఖులు వీరే..
Published date : 01 Feb 2024 09:18AM