TS ECET 2022 Exam Dates : బ్రేకింగ్ న్యూస్.. వాయిదా పడ్డ ఈసెట్ కొత్త పరీక్ష తేదీలు ఇవే.. ఈసారి మాత్రం..
ఈ వాయిదా పడ్డ TS ECET 2022 పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి జూలై 19వ తేదీన ప్రకటించారు. TS ECET 2022 పరీక్ష ఆగస్టు 1వ తేదీన.., అలాగే TS PGECET ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
College Predictor 2021 : AP EAPCET | TS EAMCET
టీఎస్ ఎంసెట్-2022(అగ్రికల్చర్) మాత్రం..
జూలై 14వ తేదీ(గురువారం) నుంచి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేసిన విషయం తెల్సిందే. ఈ వాయిదా పడ్డ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి జూలై 19వ తేదీన ప్రకటించింది. TS EAMCET 2022(Agriculture) పరీక్షల తేదీలు జూలై 30, 31వ తేదీన జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే జూలై 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా జరుగుతున్న విషయం తెల్సిందే.
సవరించిన పరీక్షల తేదీలు ఇవే..
1. టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)-జులై 30, 31 తేదీల్లో..
➤ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు
➤ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న
☛ ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు
☛ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు
➤ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు
➤ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు
ఎంసెట్ స్టడీమెటీరియర్, సిలబస్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి