Skip to main content

TS EAMCET 2023 Top 10 Ranker : ఎంసెట్ టాప్‌-10 ర్యాంక‌ర్లు వీరే.. ఎక్కువ‌ మంది..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాలను మే 25వ తేదీ ఉద‌యం 9:30 నిమిషాల‌కు విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఇంజినీరింగ్‌లో 80 శాతం, అగ్రికల్చర్‌లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ స్ట్రీమ్ లో 1,10544 మంది పరీక్ష రాయగా.. 91,935 మంది విద్యార్థులు (86 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
TS EAMCET 2023 Top 10 Rankers list
TS EAMCET 2023 Top 10 Rankers

ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం ఉత్తీర్ణులు కాగా, 82 శాతం మంది అమ్మాయిలు పాసయ్యారని తెలిపారు. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 84 శాతం మంది అబ్బాయిలు పాస్ కాగా.. అమ్మాయిలు 87 శాతం మంది పాసైనట్లు వెల్లడించారు.

Check College Predictor : AP EAPCET TS EAMCET

తెలంగాణ ఎంసెట్‌- 2023 అగ్రికల్చర్‌&మెడికల్ టాప్‌-10 ర్యాంక‌ర్లు వీరే..
1. బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్‌ (తూర్పుగోదావరి జిల్లా)
2. నశిక వెంకటతేజ (చీరాల)
3. సఫల్‌లక్ష్మి పసుపులేటి (సరూర్‌నగర్‌)
4. దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి)
5. బోర వరుణ్‌ చక్రవర్తి (శ్రీకాకుళం)
6. దేవగుడి గురు శశిధర్‌రెడ్డి (హైదరాబాద్‌)
7. వంగీపురం హర్షిల్‌సాయి (నెల్లూరు)
8. దద్దనాల సాయి చిద్విలాస్‌రెడ్డి (గుంటూరు)
9. గంథమనేని గిరివర్షిత (అనంతపురం)
10. కొల్లబాతుల ప్రీతమ్‌ సిద్ధార్థ్‌ (హైదరాబాద్‌)

☛ Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

తెలంగాణ ఎంసెట్‌- 2023 ఇంజినీరింగ్‌లో టాప్‌-10 ర్యాంక‌ర్లు వీరే..
1. సనపల అనిరుధ్‌ (విశాఖపట్నం)
2. ఎక్కింటిపాని వెంకట మణిందర్‌ రెడ్డి (గుంటూరు)
3. చల్లా ఉమేశ్‌ వరుణ్‌ (నందిగామ)
4. అభినీత్‌ మాజేటి (కొండాపూర్‌)
5. పొన్నతోట ప్రమోద్‌కుమార్‌రెడ్డి (తాడిపత్రి)
6. మారదాన ధీరజ్‌కుమార్‌ (విశాఖపట్నం)
7. వడ్డే షన్వితారెడ్డి (నల్గొండ)
8. బోయిన సంజన (శ్రీకాకుళం)
9. నంద్యాల ప్రిన్స్‌ బ్రన్హమ్‌రెడ్డి (నంద్యాల)
10. మీసాల ప్రణతి శ్రీజ (విజయనగరం) 

☛ Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?
టీఎస్ ఎంసెట్‌: 2023 ఇంజినీరింగ్‌ విభాగంలో..
☛ పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు : 1,53,890
☛ పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు : 51,461
☛ పరీక్షకు హాజరైన విద్యార్థులు : 1,95,275
☛ ఉత్తీర్ణత సాధించినవారు : 1,57,879
☛ ఉత్తీర్ణత శాతం : 80%
☛ బాలురు ఉత్తీర్ణత శాతం : 79%
☛ బాలికల ఉత్తీర్ణత శాతం : 82%

టీఎస్ ఎంసెట్‌-2023 అగ్రికల్చర్‌- మెడికల్‌ విభాగాలు నుంచి..
☛ పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు : 94,589
☛ పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు : 20,743
☛ పరీక్షకు హాజరైన విద్యార్థులు : 1,01,544
☛ ఉత్తీర్ణత సాధించినవారు : 91,935 
☛ ఉత్తీర్ణత శాతం : 86%
☛ బాలురు ఉత్తీర్ణత శాతం : 84%
☛ బాలికల ఉత్తీర్ణత శాతం : 87%

TS EAMCET Results 2023 కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. జూన్ నెల ఇంజ‌నీరింగ్‌ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇంజ‌నీరింగ్‌కు 195275 మంది హాజ‌ర‌య్యారు. ఇలాగే అగ్రిక‌ల్చ‌ర్‌కు 106514 మంది విద్యార్థులు హాజర‌య్యారు.  స్థానికుల‌కు 85 శాతం కోట‌ను క‌ల్పించారు. ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం మీద 94.44 శాతం హాజ‌ర‌య్యారు.

How to check TS EAMCET 2023 Results:
☛ Visit results.sakshieducation.com or sakshieducation.com
☛ Click on TS EAMCET 2023 Results link available on the home page
☛ In the next page, enter your hall ticket no. and click on submit
☛ The results will be displayed on the screen
☛ Save a copy of the marks sheet for further reference

టీఎస్ ఎంసెట్ -2023 ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

ఈ సారి టీఎస్ ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ లేదు.. కానీ 
మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష,  మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎంసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్) ప్రాథమిక ‘కీ’ తో పాటు రెస్పాన్స్ షీట్లుల‌ను కూడా మే 14వ తేదీ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ సారి టీఎస్ ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ లేదు. ఈ సారి విద్యార్థులకు ఎంసెట్‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్ర‌క‌టించారు.

Also Read: TS EAMCET 2023 Marks Vs Expected Rank; Check Rank Predictor

ఈ సారి భారీగా..
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ విభాగాలకు కలిపి 3,20,310 మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీవి 72,164 ఉన్నాయి. గత సంవత్సరం (2022) మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూహ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరిగాయి.

టీఎస్‌ ఎంసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్) టాప్‌-10 ర్యాంక‌ర్లు వీరే.. 

Published date : 25 May 2023 12:33PM

Photo Stories