Skip to main content

ఎంసెట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల విజయఢంకా

ఎంసెట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల విజయఢంకా పదివేల లోపు ర్యాంకులు సాధించిన 26మంది విద్యార్థులు అగ్రికల్చర్ లో 20మంది, ఇంజనీరింగ్ లో 6మంది విద్యార్థులకు పదివేల లోపు ర్యాంకులు అర్హత సాధించిన 2106 మంది విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మంత్రి గంగుల, ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్యబట్టు ఎంసెట్ 2023 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బా పూలే  బిసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి విజయఢంకా మోగించారు.
Eamcet
ఎంసెట్ ఫలితాల్లో బిసీ గురుకుల విద్యార్థుల విజయఢంకా

ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షలో అగ్రికల్చర్ విభాగంలో అత్యధిక మంది విద్యార్థులు ర్యాంక్ లు సాధించారు. 26 మంది విద్యార్థులు పది వేలలోపు ర్యాంకులు సాధించి  ఎంసెట్ ఫలితాల్లో తమ సత్తా చాటారు. 2106 మంది విద్యార్థులు ఎంసెట్ లో అర్హత సాధించారు. ఎస్. కీర్తి 1182 ర్యాంక్ , ఎ. రిషిత 3311 ర్యాంక్, నందిని 3889, పి. వైష్ణవి 3930 ర్యాంక్, కె. రమేష్ 4012 ర్యాంక్, చందన 4539, శివానీ 5875, వర్షిత 6314, అశ్విత 7355 ర్యాంక్, నిఖిత శ్రీ 7875 ర్యాంక్, స్పందన 7934, భవానీ 8303, దీప్తి 8360 ర్యాంక్, శ్రియ 8621, నికృతి 8738, వినీత 9131 ర్యాంక్, శ్రావణి 9245 ర్యాంక్, తేజస్వీ 9296, మహతి 9603 శిరీష 9615 ర్యాంక్ సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో  అబ్బాయిల్లో కె.నందు 5808 ర్యాంక్, జె. సునీల్ 6270 ర్యాంక్, టి. కార్తిక్ 8620 ర్యాంక్, కె. దీపక్ 9804 ర్యాంక్ సాధించారు. అమ్మాయిల్లో శృతి 9637 ర్యాంక్, రమ్య 9707 ర్యాంక్ సాధించారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో అందిస్తున్నగురుకుల విద్య విధానం ఫలితంగా విద్యార్థులు ఈ ర్యాంక్ లు సాధించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, బీసీ గురుకుల బోధనా సిబ్బందిని అభినందించారు. బిసీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో గురుకులాలు పనిచేస్తున్నాయని బిసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఐఎఎస్ అన్నారు. ర్యాంక్ లు సాధించిన విద్యార్థులు, బోధనా సిబ్బందిని ఆయన అభినందించారు. ర్యాంక్ లు సాధించిన విద్యార్థులను మహ్మాతా జ్యోతి బా పూలే బిసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు అభినందించారు.

Published date : 26 May 2023 04:33PM

Photo Stories