Skip to main content

TS EAPCET 2024 Exam Dates Changes : Breaking News.. TS EAPCET ప‌రీక్షల‌ తేదీలు మార్పు.. కొత్త తేదీలు ఇవే.. అలాగే ICET కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ కీల‌క‌మైన ఈఏపీసెట్–2024 ప‌రీక్ష తేదీల‌ను మార్పు చేశారు.
TS EAPCET and ICET 2024 Exam Dates Changes

TS EAPCET 2024  ఆగ్రికల్చర్ & ఫార్మా పరీక్షలను మే 7, 8వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. అలాగే ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను మే  9, 10, 11వ తేదీలలో ని‌ర్వహించనున్నారు.  TS EAPCET 2024 గ‌తంలో ఇచ్చిన తేదీల ప్ర‌కార‌మ అయితే.. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల్సింది.

☛ AP EAPCET 2024 New Schedule : బ్రేకింగ్ న్యూస్‌.. AP EAPCET 2024 పరీక్షల షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీలు ఇవే.. అలాగే ఈ ప‌రీక్ష‌లు కూడా..

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఈఏపీసెట్‌-2024 (ఎంసెట్)కు 1,68,798 దరఖాస్తులొచ్చాయి. ఇంజినీరింగ్ విభాగానికి 1,18,387 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 50,265 మంది, ఆ రెండు విభాగాలకూ 146 మంది కలిపి మొత్తం 1,68,798 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 6వ‌ తేదీ వరకు ఉన్న విషయం తెలిసిందే.

TS ICET 2024 పరీక్షల తేదీలు కూడా మార్పు..

ts icet 2024 new exam dates

అలాగే ఐసెట్ 2024 పరీక్ష తేదీలను మారుస్తూ ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ TS ICET 2024 పరీక్షలను కొత్త తేదీల ప్ర‌కారం జూన్ 5, 6వ తేదీలలో నిర్వహించనున్నారు. TS ICET 2024 పాత తేదీలు జూన్ 4, 5 తేదీలు.

TS ICET 2024 దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 రుసుం చెల్లించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 అపరాధ రుసుంతో మే 17వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో మే 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 20వ తేదీ వరకు మార్పులు చేసుకోవచ్చునని, మే 20వ తేదీనుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు.

TS EAPCET 2024 & TS ICET 2024 ముఖ్య‌మైన తేదీలు ఇవే..

 

TS EAPCET Revised Exam Schedule 2024 :

  • Agricultural & Pharmacy (A&P): 07.05.2024 (FN & AN) & 08.05.2024 (FN) 
  • Engineering (E): 09.05.2024 (FN & AN), 10.05.2024 (FN & AN) & 11.05.2024 (FN) 
  • Forenoon (FN): 09.00 AM to 12.00 Noon 
  • Afternoon (AN): 03.00 PM to 06.00 PM 

TS ICET Revised Exam Schedule 2024 :

  • Dates: 05.06.2024 (FN & AN) & 06.06.2024 (FN) 
  • Forenoon (FN): 10.00 AM to 12.30 PM 
  • Afternoon (AN) : 02.30 PM to 05.00 PM

TS EAPCET 2024 & TS ICET 2024 పూర్తి స‌మాచారం ఇదే..

Published date : 22 Mar 2024 07:36PM
PDF

Photo Stories