TS EAMCET Hall Ticket 2023 Download link : ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
అలాగే ఎంసెట్ హాల్‌టికెట్లులను కూడా తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేసింది.
టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లులను డౌన్‌లోడ్ చేసుకోండిలా..
➤ ఎంసెట్ అభ్యర్థులు మొదటగా https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్ లోకి వెళ్లండి.
➤ తర్వాత తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
➤ మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
➤ తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
☛ టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
పరీక్ష తేదీలు ఇవే..
ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష ఉంటుంది.
దరఖాస్తుకు చివరితేది ఇదే.. :
టీఎస్ ఎంసెట్‌కు ఆలస్యరుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మూడురోజులే గడువు ఉంది. దరఖాస్తు గడువు ఏప్రిల్ 10నే గడువు ముగియగా.. రూ.5000 ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.
టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఎప్పుడంటే..?
టీఎస్ ఎంసెట్ పరీక్షలు ముగిసిన రెండు వారాల్లో ఫలితాలను ప్రకటిస్తారు. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ లేకపోవడంతో ఇంటర్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఫలితాల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల ఎంసెట్ మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. పరీక్ష ముగిసిన రెండు రోజుల్లో ప్రాథమిక ‘కీ ’ని.. రెస్పాన్స్‌షీట్లను విడుదల చేసి 72 గంటల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ వెంటనే తుది ‘కీ’ని వెల్లడించి.. ఫలితాల ప్రక్రియను ప్రారంభిస్తారు.
భారీగా దరఖాస్తులు..
తెలంగాణ ఎంసెట్‌కు ఈసారి భారీగా దరఖాస్తులొచ్చాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌లో నూ ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. ఇప్పటివరకూ రెండు విభాగాలకు కలిపి 3,20,310 అప్లికేషన్లు అందాయి. ఇందులో తెలంగాణకు చెందినవి 2,48,146, ఏపీవి 72,164 ఉన్నాయి. గత సంవత్సరం (2022) మొత్తం 2,66,714 దరఖాస్తులే రావడం గమనార్హం. కాగా ఈ ఏడాది అనూ హ్యంగా 53,224 దరఖాస్తులు (20%) పెరగడంతో ఆ మేరకు పరీ క్ష కేంద్రాల పెంపుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
దేశవ్యాప్తంగా 2019 చివరలో కోవిడ్ విజృంభించడం, రెండేళ్ళ పాటు విద్యా సంస్థలు సరిగా నడవకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021లో టెన్త్ వార్షిక పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పాస్ చేశారు. ఎప్పటిలాగే పరీక్షలు జరిగితే 20 శాతం వడపోత అక్కడే జరిగేది. కానీ పరీక్షలు లేకపోవడంతో విద్యార్థులు చాలావరకు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు తీసుకున్నారు. వీళ్ళే ఇంటర్ పూర్తి చేసుకుని ఇప్పుడు ఎంసెట్ రాస్తున్నారు. అంటే ఎంసెట్ దరఖాస్తులు పెరగడానికి ‘అంతా పాస్’దోహదపడిందన్న మాట.
క్రేజ్ కూడా కారణం ఇదే..
జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఈఈ రాయాల్సి ఉంటుంది. ఇందులో ర్యాంకు రావాలంటే బాగానే కష్టపడాలి. ముమ్మర కోచింగ్ తీసుకోవాలి. ఇంతా చేసి సాధారణ ర్యాంకు వస్తే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు లభించడం కష్టం. ఈ కారణంగానే ఇంటర్ ఉత్తీర్ణుల్లో సగానికిపైగా జేఈఈ వైపు వెళ్ళడం లేదు. ఎలాగైనా కంప్యూటర్ సంబంధిత ఇంజనీరింగ్ కోర్సు చేయాలనుకుంటున్న వారు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎంసెట్‌కు 3 లక్షల మంది దరఖాస్తు చేస్తే, జేఈఈకి 1.40 లక్షల మందే దరఖాస్తు చేయడం గమనార్హం.
మరోవైపు విద్యార్థుల అభిమతానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ట్రెండ్ మార్చాయి. సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుంటున్నాయి. వీటి స్థానంలో సీఎస్‌సీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచుకుంటున్నాయి. దీంతో ఎంసెట్‌లో అర్హత సాధిస్తే ఏదో ఒక కాలేజీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు అనువైన కంప్యూటర్ కోర్సు సీటు వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు.ఎంసెట్‌కు దరఖాస్తులు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎంసెట్ కోసం మొత్తం 21 జోన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 16 జోన్లు తెలంగాణలో, 5 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న జోన్లలో ఐదు హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,48,146 ఎంసెట్ దరఖాస్తులొస్తే, హైదరాబాద్ కేంద్రంగానే 1,71,300 అప్లికేషన్లు వచ్చాయి.
హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లోనే జూనియర్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీల దృష్టీ ఇక్కడే ఉంటోంది. టెన్త్ పూర్తవ్వగానే ఇంటర్ విద్యాభ్యాసానికి, ఎంసెట్ శిక్షణకు హైదరాబాదే సరైన కేంద్రమని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ కారణంగానే పిల్లల్ని హాస్టళ్ళలో ఉంచి మరీ చదివిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్ కేంద్రంగానే ఎంసెట్ రాసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
రెండు రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాల పెంపు..
ఎంసెట్ దరఖాస్తులు అనూహ్యంగా పెరగడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల్లోనూ పరీక్ష కేంద్రాలు పెంచాలనే ఆలోచనతో ఉన్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష నిర్వహించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. తెలంగాణలో ఇంటర్ వెయిటేజ్ ఎత్తివేయడంతో ఈసారి ఏపీ నుంచి దరఖాస్తులు పెరిగాయి.
– ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ, జేఎన్‌టీయూహెచ్)