Skip to main content

TS EAMCET 2022 వాయిదా!

TS EAMCET 2022 Exam postponed
TS EAMCET 2022 Exam postponed
  • 14, 15 తేదీల్లో జరగాల్సిన వ్యవసాయ, మెడికల్‌ మాత్రమే
  • 18–20ల మధ్య ఇంజనీరింగ్‌ పరీక్ష యథాతథమని ప్రకటించిన ఉన్నత విద్యామండలి

తీవ్ర తర్జనభర్జనలు, విద్యార్థి సంఘాల నిరసనల నేపథ్యంలో జూలై 14, 15ల్లో జరగాల్సిన ఎంసెట్‌ను వాయిదా వేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ఈమేరకు జూలై 13న ప్రకటన విడుదల చేశారు. అయితే 14, 15 తేదీల్లో జరగాల్సిన వ్యవసాయ, మెడికల్‌ విభాగానికి చెందిన ఎంసెట్‌ మాత్రమే వాయిదా వేశామని, 18 నుంచి 20వరకూ జరిగే ఇంజనీరింగ్‌ విభాగం ఎంసెట్‌ యథావిధిగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాయిదా పడ్డ ఎంసెట్‌ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలి పారు. రాబోయే మూడు రోజులూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఐటీ కన్సల్టెన్సీ సంస్థ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకున్న మండలి వర్గాలు కూడా వర్షాలున్నా ఎంసెట్‌ను నిర్వహించి తీరుతామని తొలుత స్పష్టం చేశాయి. విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఎంసెట్‌ను వాయిదా వేయడానికి ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. 

also read: EAPCET: 2,82,496 మంది హాజరు

Published date : 14 Jul 2022 02:57PM

Photo Stories