EAMCET 2022: విద్యార్థులు ఆసక్తి.. బారీగా దరఖాస్తులు
Sakshi Education
రాష్ట్రంలో 2022 ఎంసెట్‌పై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నా రు. తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు TS EAMCET కోసం పోటీ పడుతున్నారు.
ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖా స్తు చేసుకొనేందుకు మే 28తో గడువు ముగిసింది. అప్పటికే దాదాపు 2.63 లక్షల మంది EAMCETలోని రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 2,51,604 మంది దరఖాస్తు చేసుకున్నారు. అపరాధ రుసుముతో జూలై 7 వరకూ దర ఖాస్తు చేసుకోవచ్చు. దీంతో మరిన్ని Applications వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. ఎంసెట్ వచ్చే జూలై 14 నుంచి జరు గనుంది. జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులకు... 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఎంసెట్ నిర్వహిస్తారు. ఈసారి నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలను కూడా ఎంసెట్ ర్యాంకు ఆధారంగానే నిర్వహిస్తున్నారు. దీంతో నర్సింగ్‌లో చేరాలనుకొనే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే వీలుందని అధికారులు తెలిపారు.
చదవండి:
Published date : 15 Jun 2022 04:12PM