EAMCET 2023: ‘వెయిటేజ్’ ఎత్తివేత.. కారణం ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌కు ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ను ఎత్తివేశారు. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక ఎంసెట్‌లో పొందే మార్కుల ఆధారంగానే ర్యాంకు ఇస్తారు.
విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈ మేరకు ఏప్రిల్ 19న ఉత్తర్వులు ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు సరిగా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 2022 వరకూ 70% సిలబస్‌ను అమలు చేశారు. దీంతో ఇంటర్ మార్కుల వెయిటేజ్ లేకుండానే ఎంసెట్ ర్యాంకులు ఇచ్చారు.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇంటర్ మార్కులు ఎక్కువ రావడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు అనేక కారణాల వల్ల తక్కువ మార్కులు వస్తుండటంతో ఎంసెట్ ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ సమీక్షించిన విద్యాశాఖ ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ని ఎత్తివేసింది.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS
Published date : 20 Apr 2023 01:03PM