Skip to main content

AP EAPCET 2022 Rules : రేప‌టి నుంచే ఏపీ ఈఏపీసెట్‌–2022.. ఖచ్చితంగా ఈ నిబంధ‌న‌లు పాటించాల్సిందే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌–2022 పరీక్షలను జూలై 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి చెప్పారు.
AP EAMCET 2022
AP EAMCET 2022

జూలై 2వ తేదీన ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జేఈఈ వంటి జాతీయ పరీక్షలకు అమలు చేస్తున్న మాదిరిగానే ఒక్క నిమిషం నిబంధనను ఈఏపీసెట్‌కు కూడా అమలు చేస్తున్నామన్నారు.

AP EAPCET - 2022: విజయానికి అనురించాల్సిన వ్యూహాలు... ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం!

గంట ముందుగానే..
అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకు రావాలని సూచించారు. బాల్‌పాయింట్‌ పెన్నులు, రఫ్‌ వర్క్‌ చేసుకోవడానికి అవసరమైన కాగితాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారన్నారు. పరీక్షల సమయాల్లో విద్యార్థులకు అనువుగా ఉండేలా బస్సులు నడపాలని ఇప్పటికే ఆర్టీసీ అధికారులను కోరామన్నారు. 

AP EAPCET: కంప్యూటర్‌ సైన్స్ టాప్‌.. ఇతర కొత్త కోర్సుల్లో సీట్ల కేటాయింపు పూర్తి వివరాలు

ఈ సారి భారీగా..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఈఏపీసెట్‌కు 3,00,084 మంది దరఖాస్తు చేశారని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు తెలిపారు. ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కులకు వెయిటేజీ ఉండదని, సెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటిస్తామని చెప్పారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయన్నారు. 

జేఈఈ మెయిన్..ముందస్తు ప్రణాళికలతో సక్సెస్ సునాయసమే

ఈ నిబంధనలు పక్కాగా పాటించాల్సిందే..
☛ ఏపీ ఈఏపీసెట్‌ను జూలై 4 నుంచి 8వ తేదీ వరకు రోజుకు రెండు చొప్పున 10 సెషన్లలో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరుగుతాయి. 
☛ 11, 12 తేదీల్లో 4 సెషన్లలో బైపీసీ స్ట్రీమ్‌ పరీక్షలు జరుగుతాయి.
☛ అభ్యర్థులు తమ హాల్‌ టికెట్‌లోని పేరు, పుట్టిన తేదీ, జెండర్, కేటగిరీ, స్ట్రీమ్‌ వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తప్పు ఉంటే ఈఏపీసెట్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రానికి తెలియజేసి సరిచేయించుకోవాలి.
☛ హాల్‌ టికెట్‌ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు
☛ ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి. పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు వీలుగా మ్యాప్‌ల ద్వారా మార్గాన్ని చూపించే సదుపాయం కల్పించారు.
☛ విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 
☛ చెక్‌ఇన్‌ ప్రొసీజర్‌లో భాగంగా బయోమెట్రిక్‌ ఇన్ఫర్మేషన్‌ కేప్చర్‌ చేస్తారు. ఎడమ వేలి ముద్ర ద్వారా వీటిని నమోదు చేయనున్నందున అభ్యర్థులు మెహిందీ వంటివి పెట్టుకోకూడదు.
☛ బాల్‌పెన్నుతో అప్లికేషన్‌ ఫారాన్ని నింపి దానికి ఫొటోను అతికించి ఇన్విజిలేటర్‌ సమక్షంలో సంతకం చేసి అందించాలి. అలా అప్లికేషన్‌ను సమర్పించని వారి ఫలితాలను ప్రకటించరు.
☛ పరీక్ష సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడి వెంటనే పరిష్కారం కాకపోతే ఎంత సమయం ఆలస్యమైందో ఆమేరకు అదనపు సమయాన్ని ఇస్తారు. 
☛ హాల్‌ టికెట్లను కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలి.
☛ ఇతర వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్‌://సీఈటీఎస్‌.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.జీఓవీ.ఐఎన్‌/ఈఏపీ సీఈటీ’ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు
☛ సందేహాలుంటే  apeapcet2022helpdesk@gmail.com కు తెలియజేయవచ్చు. లేదా 08554–234311 లేదా 08554–232248 నంబర్లలో సంప్రదించవచ్చు.  

ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

పరీక్షల తేదీలు ఇవే..
ఈఏపీసెట్‌ పరీక్షలు జూలై 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ 4 నుంచి 8 వరకు.. అగ్రి, ఫార్మా స్ట్రీమ్‌ జూలై 11, 12 తేదీల్లో జరుగుతాయి. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటరీ్మడియెట్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో ఈఏపీ సెట్‌లో మెరిట్‌ ర్యాంకులు పూర్తిగా సెట్‌ పరీక్షల మార్కుల ఆధారంగానే ఇవ్వనున్నారు.

దరఖాస్తు చివరి తేదీ ఇదే..
ఏప్రిల్‌ 11న ఏపీ ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 10 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు ఇచ్చారు. ఆ తరువాత ఆలస్య రుసుము రూ.500తో జూన్‌ 20 వరకు, రూ.1,000తో జూన్‌ 25 వరకు, రూ.5,000తో జూలై 1వరకు, రూ.10,000తో జూలె 3వరకు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు గడువుగా నిర్ణయించారు. ఇక ఆలస్య రుసుము లేకుండా నిర్ణయించిన గడువు మే 10 నాటికి 2,74,260 దరఖాస్తులు దాఖలయ్యాయి. గడువు ముగిసినా ఇంకా  ఆలస్య రుసుముతో దరఖాస్తులు సమర్పిసూ్తనే ఉన్నారు. రూ.5,000 ఆలస్య రుసుముతో కూడా ఇంకా పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడం విశేషం. జూన్‌ 30వ తేదీన ఇక (గురువారం) కొత్తగా 37 మంది రూ.5వేల ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్‌ ఫీజు కట్టారు. జులై 3 వరకు గడువు ఉన్నందున ఈ దరఖాస్తులు ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 2020లో 2.60 లక్షల మంది, 2021లో 2.73 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2015–16 నుంచి జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా 2016–17లో 2.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. అంతకు మించి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి.

ఎంసెట్: మోడల్ పేపర్లు | ప్రివియస్‌ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు

Published date : 03 Jul 2022 12:27PM

Photo Stories