Physical Sciences Methodology : న్యూటన్ జీవిత చరిత్రను బోధించడానికి అనువైన పద్ధతి ఏది..?
బోధన ఉపగమాలు
కమ్యూనికేషన్ అనే పదం కమ్యూనిస్ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. లాటిన్‌లో కమ్యూనిస్ అంటే కామన్.
☛ భావ ప్రసార ప్రక్రియలోని దశల సంఖ్య – 4.
☛ భావ ప్రసార ప్రక్రియలో సందేశం అంటే చెప్పాల్సిన విషయం.
☛ భావ ప్రసార ప్రక్రియలో మాధ్యమం అంటే చెప్పే విధానం.
☛ బోధనాభ్యసన ప్రక్రియకు మూలాధారాలు – చర్య, పరస్పర చర్య
– పునర్బలనం.
☛ ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య జరిగే పరస్పర చర్యా ప్రక్రియే బోధన అని పేర్కొన్నవారు – ఎడ్మండ్ ఎమిడాన్.
☛ బోధన ఒక పరస్పర చర్యా ప్రక్రియ అని పేర్కొన్నది – ఎ. ప్లాండర్స్.
☛ బోధనలో అతి తక్కువ స్థాయికి చెందింది – శిక్షణ
☛ బోధనలో ఉన్నత స్థాయికి చెందింది – ఉపదేశం.
☛ స్మృతి స్థాయి బోధన నమూనాను రూపోందించింది – జె.ఎస్. హెర్బర్ట్.
☛ అవగాహన స్థాయి బోధన నమూనాను రూపోందించింది – మోరిసన్.
☛ పర్యాలోచక స్థాయి బోధన నమూనాను ప్రతిపాదించింది – హంట్.
☛ మెథడ్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది.
☛ పద్ధతి అంటే అర్థం – విధం లేదా మార్గం.
☛ బోధన పద్ధతులు రెండు రకాలు.
Paralympics: పారాలింపిక్స్‌లో 25కు చేరిన భారత్ పతకాల సంఖ్య
బోధన పద్ధతులు – రకాలు
ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు
1. ఉపన్యాస పద్ధతి
2. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
3. చారిత్రక పద్ధతి
విద్యార్థి కేంద్రక పద్ధతులు
1. అన్వేషణ పద్ధతి 2. ప్రకల్పన పద్ధతి
3. ప్రయోగశాల పద్ధతి 4. ఆగమన,నిగమన పద్ధతి
5. సమస్యా పరిష్కార పద్ధతి
☛ ముఖతః విషయ పరిజ్ఞానాన్ని బోధించే పద్ధతి – ఉపన్యాస పద్ధతి.
☛ చారిత్రక పద్ధతిని ఉపయోగించే పద్ధతులు – ఉపాఖ్యాన పద్ధతి, జీవిత చరిత్ర పద్ధతి, పరిణామ పద్ధతి, సాంఘిక పద్ధతి.
☛ అన్వేషణ పద్ధతికి మరోపేరు–హ్యూరిస్టిక్ పద్ధతి
☛ గ్రీకు భాషలో హ్యూరిస్కా అంటే కనిపెట్టడం లేదా పరిశోధించడం.
☛ హ్యూరిస్టిక్ పద్ధతిని రసాయన శాస్త్ర బోధనలో తొలిసారిగా ప్రవేశపెట్టింది – ఆర్మ్‌స్ట్రాంగ్.
☛ అన్వేషణ పద్ధతిని ఒక ప్రధాన విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతిగా అంగీకరించని రి΄ోర్ట్ – థామ్సన్ రి΄ోర్ట్.
☛ జాన్ డ్యూయీ ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదాన్ని అనుసరించి రూపోందించిన పద్ధతి – ప్రకల్పన పద్ధతి.
☛ ప్రకల్పన పద్ధతిని మొదటిసారిగా ఆచరణలో పెట్టిన విద్యావేత్త –కిల్‌పాట్రిక్.
☛ అనువైన సహజ పరిసరాల్లో పూర్తి చేసే సమస్యా కృత్యం..ప్రకల్పన అని నిర్వచించింది–స్టీవెన్‌సన్
☛ పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగం ప్రకల్పన అని పేర్కొన్నది – బెల్లార్డ్
☛ ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు.
1) వాస్తవికత సూత్రం
2) క్రియాత్మకతా సూత్రం
3) ఉపయుక్తతా సూత్రం 4) స్వేచ్ఛా సూత్రం 5) పొదుపు 6) సహ సంబంధం
☛ థార్నడైక్ అభ్యసన సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్న పద్ధతి –ప్రాజెక్టు పద్ధతి.
☛ ప్రయోగశాల పద్ధతిని 3 రకాలుగా నిర్వహించవచ్చు.
☛ ప్రయోగశాలలోని ప్రయోగాలను 5 రకాలుగా విభజించవచ్చు.
☛ సమస్యా పరిష్కార పద్ధతిలో మొదటి సో΄ానం – సమస్యను గుర్తించడం.
☛ లెక్చర్ అంటే – బిగ్గరగా చదవడం.
Maori Crown: మావోరి తెగకు కొత్త రాణి.. 27 ఏళ్ల అమ్మాయి.. ఎవరో తెలుసా..?
☛ అన్వేషణ పద్ధతిలో పాటించాల్సిన నియమాలు
1. చేయడం ద్వారా నేర్చుకొనే నియమం
2. పరిశోధన నియమం
3. తార్కికంగా ఆలోచించే నియమం
4. అభ్యసనా నియమాల నియమం
5. ప్రజాస్వామ్య వాతావరణ నియమం
6. ప్రయోజనాత్మక అనుభవాల నియమం
☛ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతుల ప్రయోజనాలు
1. బోధనోపకరణాలు – ప్రయోగశాలల ఆవశ్యకత లేదు.
2. సకాలంలో సిలబస్ పూర్తవుతుంది.
3. ఎక్కువ తరగతి గదులు, ఉపాధ్యాయులు అవసరం లేదు.
4. పాఠ్య పరిచయం, ముగింపు, సింహావలోకనం, సాధారణీకరణం చేసేటప్పుడు, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు మొదలైనవాటిని బోధించేటప్పుడు ఇవే ఉత్తమ పద్ధతులు.
☛ విద్యార్థి కేంద్రక పద్ధతుల ప్రయోజనాలు.
1. ప్రత్యక్ష అనుభవం,ఇంద్రియ శిక్షణ కారణంగా విద్యార్థుల్లో మూర్త భావనలు కలుగుతాయి.
2. ఈ పద్దతులు సమస్యా పరిష్కార శక్తిని పెంపోందిస్తాయి.
3. విద్యార్థుల మానసిక అవసరాలను తృప్తి పరుస్తాయి.
4. ఇవి మనో వైజ్ఞానిక పద్ధతులు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో అన్వేషణ పద్ధతిలో పాటించాల్సిన నియమం కానిది ఏది?
1) పరిశోధనా నియమం
2) అభ్యసనా నియమాల నియమం
3) ఉపయుక్తతా నియమం
4) చేయడం ద్వారా నేర్చుకొనే నియమం
2. కింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏది?
1) ప్రకల్పనా పద్ధతి
2) ఉపన్యాస పద్ధతి
3) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
4) చారిత్రక పద్ధతి
3. కింది వాటిలో చారిత్రక పద్ధతిని ఉపయోగించే పద్ధతులు?
1) ఉపఖ్యాన పద్ధతి 2) జీవిత చరిత్ర పద్ధతి
3) సాంఘిక పద్ధతి 4) పైవన్నీ
4. విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల వల్ల ప్రయోజనం ఏమిటి?
1) ప్రత్యక్షానుభవం
2) సమస్యా పరిష్కార శక్తిని పెంపోందించుట
3) విద్యార్థుల మానసిక అవసరాలను తృప్తి పరుచుట
4) పైవన్నీ
5. స్మృతి స్థాయి బోధన నమూనాను రూపోందించింది?
1) మోరిసన్ 2) హంట్
3) జె.ఎస్. హెర్బర్ట్ 4) ఎమిడాన్
6. థార్నడైక్ అభ్యసన సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్న పద్ధతి?
1) అన్వేషణ పద్ధతి 2) ప్రాజెక్టు పద్ధతి
3) చారిత్రక పద్ధతి 4) ఉపన్యాస పద్ధతి
7. అన్వేషణ పద్ధతిని ఒక ప్రధాన విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతిగా అంగీకరించని రి΄ోర్ట్?
1) మోరిసన్ రిపోర్ట్ 2) స్టీవెన్‌సన్ రిపోర్ట్
3) థామ్సన్ రిపోర్ట్ 4) బెల్లార్డ్ రిపో ర్ట్
8. న్యూటన్ జీవిత చరిత్రను బోధించడానికి అనువైన పద్ధతి?
1) ప్రాజెక్టు పద్ధతి 2) అన్వేషణ పద్ధతి
3) చారిత్రక పద్ధతి 4) ఉపన్యాస పద్ధతి
9. గ్రీకు భాషలో హ్యూరిస్కా అంటే?
1) కనిపెట్టడం 2) ప్రకల్పన
3) పరిశోధించడం 4) 1, 3
10. కింది వాటిలో భావ ప్రసార ప్రక్రియలో చెప్పే విధానం దేనిని సూచిస్తుంది?
1) సందేశం 2) మాధ్యమం
3) పునర్బలనం 4) ఏదీకాదు
National Teachers Awards 2024: ఉత్తమ అధ్యాపకురాలు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం.. నగదు బహుమతి ఎంతో తెలుసా?
11. పరస్పర భావాలను పంచుకొనే విధానాన్ని ఏమంటారు?
1) కమ్యూనికేషన్ 2) చర్చ
3) ప్రక్రియ 4) సందేశం
12. లాటిన్‌లో కమ్యూనిస్ అంటే?
1) మాధ్యమం 2) ప్రత్యక్షం
3) కామన్ 4) అన్నీ
13. భావ ప్రసార ప్రక్రియలోని దశల సంఖ్య?
1) రెండు 2) మూడు
3) ఐదు 4) నాలుగు
14. బోధన ఒక పరస్పర చర్యా ప్రక్రియ అని పేర్కొన్నది?
1) ప్లాండర్స్ 2) ఎడ్మండ్ ఎమిడాన్
3) బి.ఒ. స్మిత్ 4) మోరిసన్
15. ప్రవర్తన అలవాట్లలో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నించే ప్రక్రియనేమంటారు?
1) ఉద్దీపన 2) శిక్షణ
3) నిబంధనం 4) ప్రక్రియ
16. బోధనలో అతి తక్కువ స్థాయికి చెందింది?
1) ఉపదేశం 2) నిబంధనం
3) శిక్షణ 4) సిద్ధాంతీకరణ
17. బోధనలో ఉన్నత స్థాయికి చెందింది?
1) నిబంధనం 2) ఉపదేశం
3) శిక్షణ 4) సిద్ధాంతీకరణ
18. హ్యూరిస్టిక్ పద్ధతిని రూపోందించినవారు?
1) జాన్ డ్యూయీ 2) పెస్టాలజీ
3) కిల్‌పాట్రిక్ 4) హెచ్.ఎ.ఆర్మ్‌స్ట్రాంగ్
19. ఉపాధ్యాయ కేంద్రక పద్ధతికి ఉదాహరణ?
1) అన్వేషణ పద్ధతి 2) ప్రకల్పన పద్ధతి
3) చారిత్రక పద్ధతి 4) ప్రయోగాల పద్ధతి
20. రేడియో ధార్మికత పాఠ్యాంశాన్ని బోధించడానికి మిక్కిలి అనుసరణీయమైన పద్ధతి?
1) ఉపన్యాస పద్ధతి
2) అన్వేషణ పద్ధతి
3) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
4) ప్రయోగశాల పద్ధతి
Srikushal Yarlagadda: భవిష్యత్తును చెప్పే డెస్టినీ.. ఏఐ యాప్ రూపకల్పనలో హైదరాబాదీ.. తల్లి భవితపై ప్రయోగాలు
21. సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ్ర΄ాజెక్టు అని నిర్వచించినవారు?
1) కిల్‌పాట్రిక్ 2) బెల్లార్డ్
3) బైనింగ్ అండ్ బైనింగ్ 4) జె.ఎ.స్టీవెన్‌సన్
22. సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్యాత్మక ప్రక్రియ చిచిచి అనే వాక్యం దేన్ని ఉద్దేశించింది?
1) ప్రయోగం 2) ప్రకల్పన
3) ప్రదర్శన 4) సిద్ధాంతం
23. దత్తాంశాలను ప్రతిక్షేపించడం అనేది ఏ పద్ధతిలోని సోపానం?
1) ప్రదర్శన పద్ధతి
2) శాస్త్రీయ/వైజ్ఞానిక పద్ధతి
3) ఉపన్యాస పద్ధతి
4) ప్రకల్పన పద్ధతి
24. బోధనలో అతి తక్కువ స్థాయికి చెందింది?
1) ఉపదేశం 2) నిబంధనం
3) శిక్షణ 4) సిద్ధాంతీకరణ
25. ఎక్కాలు, గ్రామర్ సూత్రాలు, చిహ్నాలు, గుర్తులు లాంటివి నేర్చుకోవడం?
1) పర్యాలోచక స్థాయి బోధన
2) అవగాహన స్థాయి బోధన
3) సమస్యాత్మక బోధన
4) స్మృతిస్థాయి బోధన
26. విద్యార్థులు తాము గుర్తించిన సమస్యలను విడిగా, గ్రూపుల్లో పరిశోధించి పరిష్కారాన్ని కనుగొనే పద్ధతి?
1) చారిత్రక పద్ధతి 2) నియోజన పద్ధతి
3) ప్రదర్శన పద్ధతి 4) ప్రకల్పన పద్ధతి
27. ఉపాధ్యాయ కేంద్రక పద్ధతికి ఉదాహరణ?
1) అన్వేషణ పద్ధతి 2) ప్రకల్పన పద్ధతి
3) చారిత్రక పద్ధతి 4) ప్రయోగశాల పద్ధతి
28. తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ విశేషాంశాలను బోధించడానికి ఉపయోగపడే పద్ధతి?
1) అన్వేషణ పద్ధతి 2) ప్రకల్పన పద్ధతి
3) ఉపన్యాస పద్ధతి 4) ప్రయోగ పద్ధతి
29. హ్యూరిస్టిక్ పద్ధతిలో విద్యార్థి ΄ాత్ర?
1) నాయకుడు 2) యోజనకర్త
3) అనుచరుడు 4) పరిశోధకుడు
30. సహజ పరిసరాల్లో సమస్యను సాధించే పద్ధతి?
1) ప్రకల్పన పద్ధతి 2) హ్యూరిస్టిక్ పద్ధతి
3) ఉపన్యాస పద్ధతి 4) నియోజన పద్ధతి
31. విజ్ఞాన శాస్త్రాన్ని మిగిలిన అన్ని శాస్త్రాలతో సహ సంబంధ పరుస్తూ బోధించే పద్ధతి?
1) హ్యూరిస్టిక్ పద్ధతి
2)ప్రాజెక్టు పద్ధతి
3) సమస్యా పరిష్కార పద్ధతి
4) ప్రయోగశాల పద్ధతి
32. ఎలక్ట్రాన్ విన్యాసం రాసే విధానం బోధించేందుకు ఉపాధ్యాయుడు ఉపయోగించాల్సిన బోధన పద్ధతి?
1) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
2) ఉపన్యాస పద్ధతి
3) హ్యూరిస్టిక్ పద్ధతి
4) ప్రాజెక్టు పద్ధతి
సమాధానాలు
1) 3 2) 1 3) 4 4) 4 5) 3
6) 2 7) 3 8) 3 9) 4 10) 2
11) 1 12) 3 13) 4 14) 1 15) 3
16) 3 17) 2 18) 4 19) 3 20) 1
21) 4 22) 2 23) 2 24) 3 25) 4
26) 4 27) 3 28) 3 29) 4 30) 1
31) 2 32) 2
National Scholarships: నేషనల్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి.. ఇదే చివరి తేది
Tags
- physical science methodology
- material and model questions
- groups exams preparations
- Competitive Exams
- eligiblility exams
- dsc exam materials
- DSC Exams
- Teacher jobs
- previous questions for dsc exams
- dsc physical science material
- dsc physical science previous questions
- competitive exams for teacher jobs
- DSC 2024
- exam for teacher jobs
- Education News
- Sakshi Education News