Skip to main content

TS DSC Notification Released: 11వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవే..

School Education Department Announcement   TS DSC Notification 2024   School Education Department Announcement

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గతంలో డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. 

గత డీఎస్సీ వాయిదా.. ఎందుకంటే?
గత ఏడాది సెప్టెంబర్‌ 6వ తేదీన 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పోస్టులకు దాదాపు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అయితే పరీక్షను నిర్వహించాలనుకున్న తేదీల్లోనే అసెంబ్లీ ఎన్నికల తేదీలు రావడంతో డీఎస్సీ పరీక్షను వాయిదా వేశారు. కాగా కొత్త ప్రభుత్వం 11,062 పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బుధవారం నాటి ప్రకటనలో స్పష్టం చేసింది. 

నోటిఫికేషన్‌ వివరాలివే:

మెగా డీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. 2629 స్కూల్‌ అసిస్టెంట్‌, 6508- ఎస్‌జీటీ, 727-లాంగ్వేజ్‌ పండింట్‌,182-పీఈటీ పోస్టులు, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

Published date : 29 Feb 2024 12:48PM

Photo Stories