DSC 2024: డీఎస్సీ కొత్త నోటిఫికేషన్!.. పాత నోటిఫికేషన్‌ను రద్దు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ఫిబ్రవరి 28న ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్త నోటిఫికేషన్ ఫిబ్రవరి 29న వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు దాదాపు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: TET/DSCలో సిలబస్ ఎలా ఉంటుంది? #sakshieducation @SakshiBhavita
అయితే పరీక్షను నిర్వహించాలనుకున్న తేదీల్లోనే అసెంబ్లీ ఎన్నికల తేదీలు రావడంతో డీఎస్సీ పరీక్షను వాయిదా వేశారు. కాగా కొత్త ప్రభుత్వం 11,062 పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఫిబ్రవరి 28న నాటి ప్రకటనలో స్పష్టం చేసింది.
Published date : 29 Feb 2024 11:11AM