Skip to main content

TG DSC 2024: టెట్‌ ఆప్షన్లకు రేపటి వరకు గడువు.. ఎడిట్ చేయ‌డం ఇలా..

Edit and confirm option for TET candidates today and tomorrow

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసిన అభ్యర్థులు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వివరాల నమోదులో ఆప్షన్లు మార్చుకునేందుకు విద్యాశాఖ మరో అవకాశం ఇచ్చింది. గురు, శుక్రవారాల్లో  www.schooledu.telangnana. gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆప్షన్లు ఎడిట్‌ చేసుకోవచ్చని తెలిపింది.   

చదవండి: 

DSC 2024 Final Key: డీఎస్సీ తుది ‘కీ’లోనూ తప్పులు: అభ్యర్థులు.. Key కోసం క్లిక్ చేయండి

DSC 2024 Final Key: డీఎస్సీ తుది ‘కీ’లోనూ తప్పులు: అభ్యర్థులు.. Key కోసం క్లిక్ చేయండి

ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)కు సంబంధించి పాఠశాల విద్య డైరెక్టరేట్‌ విడుదల చేసిన తుది కీలో తప్పులున్నట్టు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు అభ్యర్థులు సెప్టెంబర్ 9న‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి వచ్చి అధికారులను కలిశారు. పాఠ్యపుస్తకాల ప్రకారం సమాధానాలు ఇవ్వలేదని, కొన్ని సమాధానాలు మార్చారని వివరించారు.

తప్పులున్న కీ ప్రకారం ఫలితాలు ప్రకటిస్తే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. అభ్యర్థుల అభ్యంతరాలపై అధికారులు స్పందించారు. మరోసారి పరిశీలన కమిటీకి అభ్యంతరాలను పంపుతామని చెప్పారు. ఒకవేళ తప్పులుంటే సరిచేసిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

డీఎస్సీ తుది కీని విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. అందులో వచ్చిన ప్రశ్నలు టెట్‌లోనూ వచ్చాయి. వాటిల్లో సమాధానాలు ఒక రకంగా ఉంటే డీఎస్సీ ఫైనల్‌ కీలో మరోలా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు.

Published date : 13 Sep 2024 10:10AM

Photo Stories