ఏఎన్‌యూ దూరవిద్య ఎంకాం ఫలితాలు విడుదల
Sakshi Education
గుంటూరు (ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఈ ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎంకాం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేశామని పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ బి.సత్యవతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఫలితాలను www.anucde.info ద్వారా పొందవచ్చు. సెప్టెంబర్ 10 లోపు పునర్ మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష ఫీజు ఒక్కో పేపర్‌కు రూ. 960 చెల్లించాలని ఆమె చెప్పారు.
Published date : 31 Aug 2016 01:35PM