దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా నిర్వహించిన వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్ర ణాధికారి డాక్టర్ వై.రెడ్డి శ్యామల తెలిపారు.
2016 అక్టోబర్‌లో వర్సిటీ నిర్వహించిన బి.ఎ.స్పెషల్ తెలుగు మొదటి, రెండవ, మూడవ సంవత్సరం పరీక్షా ఫలితాలతో పాటు ఎం.ఎ, ఇఎల్‌టీ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్ టెెలివిజన్ కోర్సు, జ్యోతిర్వాస్తు కోర్సు ఫలితాలు విడుదల అయ్యాయని చెప్పారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాలను, మార్కులను వర్సిటీ పరీక్షల విభాగం ద్వారా పొందవచ్చని ఆమె వెల్లడించారు.
Published date : 07 Mar 2017 01:38PM