world archery championships 2023: ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
August 5 జరిగిన ఈ పోటీల కాంపౌండ్ విభాగంలో ముందుగా మహారాష్ట్రకు చెందిన అదితి గోపీచంద్ స్వామి అగ్రస్థానం సాధించింది. ఫైనల్లో 17 ఏళ్ల అదితి 149–147 స్కోరుతో మెక్సికోకు చెందిన ఆండ్రీయా బెసెరాపై విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 150–147 తేడాతో ల్యూకాజ్ జిల్‌స్కీ (పోలాండ్)ను ఓడించాడు. ఓవరాల్‌గా 3 స్వర్ణాలు, ఒక కాంస్యంతో (మొత్తం 4 పతకాలు) సాధించి భారత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. శుక్రవారం భారత్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది.
☛☛ World Archery senior Championship 2023: దేశానికి తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించి ఆర్చరీ మహిళా క్రీడాకారులు
జ్యోతి సురేఖకు కాంస్యం
ప్రపంచ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో 2019లో కాంస్యం, 2021లో రజతం సాధించి∙ ఈ సారి స్వర్ణంపై గురి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖకు నిరాశ ఎదురైంది. కాంపౌండ్ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. సెమీ ఫైనల్లో సురేఖ 145 – 149 స్కోరుతో అదితి స్వామి చేతిలో ఓటమి పాలైంది.
అయితే మూడో స్థానం కోసం జరిగిన పోరులో సురేఖ చక్కటి ప్రదర్శనతో 150 స్కోరు నమోదు చేసింది. ఆమె 150 – 146 స్కోరుతో తుర్కియేకు చెందిన ఐపెక్ తోమ్రుక్‌ను ఓడించింది. ఓవరాల్‌గా ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సురేఖకు ఇది ఎనిమిదో పతకం. టీమ్, వ్యక్తిగత విభాగాల్లో కలిపి ఆమె ఒక స్వర్ణం, 4 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకుంది.
☛☛ ISSF World Junior Shooting Championships: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు