World Archery Championship 2023 Aditi Gopichand Swami : ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి.. ఇప్పటి వరకు..
ఆర్చరీలో భారత్ తరఫున మొదటి వ్యక్తిగత ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఆగస్టు 5వ తేదీన(శనివారం) జరిగిన ఫైనల్లో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాను 149-47 ఓడించడం ద్వారా జగజ్జేతగా నిలిచి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది.
గంటల వ్యవధిలో భారత్‌కు మరో స్వర్ణం..
ఇదే పోటీల్లో ఆగస్టు 4వ తేదీన (శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్‌లతో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన అదితి.. గంటల వ్యవధిలో భారత్‌కు మరో స్వర్ణం అందించింది. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న అదితి.. గత నెలలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలను సాధించింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్ షూట్-ఆఫ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన సన్నె డి లాట్‌ను ఓడించిన అదితి.. సెమీఫైనల్లో సహచరి, ఆంధ్ర అమ్మాయి జ్యోతి సురేఖపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
World University Games: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో రెండు స్వర్ణాలు