Skip to main content

World University Games: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో రెండు స్వర్ణాలు

చైనాలో జరుగుతున్న ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో భారత షూటర్‌ ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ రెండు స్వర్ణాలు సాధించాడు.
Aishwary-Pratap-Singh-Tomar
Aishwary Pratap Singh Tomar

పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ప్రతాప్, దివ్యాన్ష్‌, అర్జున్‌ల త్రయం 1894.7తో ప్రపంచ రికార్డు స్కోరు సాధించి పసిడి పతకం గెలిచింది. ఇదే ఈవెంట్‌ వ్యక్తిగత విభాగంలో ప్రతాప్‌ (252.6 స్కోరుతో) మరో బంగారు పతకం గెలిచాడు. ఆర్చరీ క్రీడ మహిళల కాంపౌండ్‌ ఈవెంట్‌లో అవ్‌నీత్‌ కౌర్, 
పురుషుల ఈవెంట్‌లో సంగమ్‌ప్రీత్‌ బిస్లా భారత్‌కు పసిడి పతకాలు అందించారు.  

☛☛ World University Games: అమన్‌–ప్రగతి జోడీకి పసిడి పతకం

Published date : 01 Aug 2023 05:09PM

Photo Stories