Archery: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన భారత జోడీ?
టర్కీలోని అంటాల్యా వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్–2022లో చివరి రోజు ఏప్రిల్ 24న భారత్‌కు రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో పసిడి పతకం లభించింది. ఫైనల్లో తరుణ్‌దీప్ రాయ్–రిధి (భారత్) ద్వయం 5–4తో ‘షూట్ ఆఫ్’లో బ్రయని పిట్మాన్–అలెక్స్ వైజ్ (బ్రిటన్) జోడీపై గెలిచి.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
GK Sports Quiz: ఏ భారతీయ క్రికెటర్ ను మాల్దీవుల ప్రభుత్వం 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డుతో సత్కరించింది?
ఎమిలియా రొమానా గ్రాండ్‌ప్రి విజేత?
ఫార్ములావన్ తాజా సీజన్‌లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్, ప్రపంచ చాంపియన్ వెర్‌స్టాపెన్ రెండో విజయం సాధించాడు. ఇటలీలోని ఇమోలా నగరం వేదికగా ఏప్రిల్ 24న జరిగిన ఎమిలియా రొమానా గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 63 ల్యాప్‌ల రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 32 నిమిషాల 07.986 సెకన్లలో ముగించి కెరీర్‌లో 22వ విజయాన్ని అందుకున్నాడు. రెడ్‌బుల్‌కే చెందిన పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. లాండో నోరిస్ (మెక్‌లారెన్)కు మూడో స్థానం దక్కింది. సీజన్‌లోని తదుపరి రేసు మయామి గ్రాండ్‌ప్రి మే 6న జరుగుతుంది.
Wrestling: ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన తొలి భారతీయుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్–2022లో స్వర్ణం గెలిచిన భారత జోడీ?
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : తరుణ్‌దీప్ రాయ్–రిధి ద్వయం
ఎక్కడ : అంటాల్యా, టర్కీ
ఎందుకు : ఫైనల్లో తరుణ్‌దీప్ రాయ్–రిధి (భారత్) ద్వయం 5–4తో ‘షూట్ ఆఫ్’లో బ్రయని పిట్మాన్–అలెక్స్ వైజ్ (బ్రిటన్) జోడీపై గెలిచినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్