Wrestling: ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన తొలి భారతీయుడు?
మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్ వేదికగా జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్–2022 పురుషుల ఫ్రీస్టయిల్ విభాగం పోటీల్లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా 57 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. ఏప్రిల్ 23న ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో 24 ఏళ్ల రవి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలో 12–2తో రఖత్ కల్జాన్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. తద్వారా వరుసగా మూడో ఏడాదీ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి భారతీయ రెజ్లర్‌గా రవి రికార్డు నెలకొల్పాడు. రవి 2020, 2021 ఆసియా చాంపియన్‌షిప్‌లలో 57 కేజీల విభాగంలోనే పసిడి పతకాలు సాధించాడు.
Wrestling: భారత క్రీడాకారిణి అన్షు మలిక్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
బజరంగ్ పూనియాకు రజతం
ఏప్రిల్ 23న ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఓవరాల్‌గా ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) లభించాయి. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా (65 కేజీలు), గౌరవ్ బలియాన్ (79 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్, 70 కేజీల విభాగంలో నవీన్ కాంస్య పతకాలు గెలిచారు.
Chess: లా రోడా ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన ఆటగాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు గెలిచిన తొలి భారతీయుడు?
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : రవి కుమార్ దహియా
ఎక్కడ : ఉలాన్‌బాటర్, మంగోలియా
ఎందుకు : 57 కేజీల విభాగం ఫైనల్లో రవి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో 12–2తో రఖత్ కల్జాన్ (కజకిస్తాన్)పై గెలుపొందడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్