Tennis Tournament: ఖతర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన జంట?
ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)– డెనిస్ షపోవలోవ్ (కెనడా) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఖతర్ రాజధాని నగరం దోహాలో ఫిబ్రవరి 18న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జోడీ 6–7 (4/7), 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–షపోవలోవ్ జోడీకి 29,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 21 లక్షల 80 వేలు) లభించింది.
బిహార్ బ్యాటర్ సకీబుల్ ప్రపంచ రికార్డు
2021–22 రంజీ ట్రోఫీ రెండో రోజు వ్యక్తిగత విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. కోల్‌కతాలో మిజోరం జట్టుతో జరుగుతున్న ‘ప్లేట్’ గ్రూప్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 18న బిహార్ బ్యాటర్ సకీబుల్ గని ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా సకీబుల్ నిలిచాడు. 405 బంతులు ఎదుర్కొన్న సకీబుల్ 56 ఫోర్లు, 2 సిక్సర్లతో 341 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత్‌కే చెందిన అజయ్ రొహెరా (267 నాటౌట్–మధ్యప్రదేశ్; 2018లో హైదరాబాద్‌పై) పేరిట ఉంది. బిహార్ తరఫున 14 దేశవాళీ వన్డేలు, 11 టి20 మ్యాచ్‌లు ఆడిన సకీబుల్ ఈ మ్యాచ్‌తోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.
చదవండి: కొత్త ఎన్‌సీఏకు ఎక్కడ శంకుస్థాపన చేశారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జంట?
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) ద్వయం
ఎక్కడ : దోహా, ఖతర్
ఎందుకు : పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జోడీ 6–7 (4/7), 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్