National Cricket Academy: కొత్త ఎన్‌సీఏకు ఎక్కడ శంకుస్థాపన చేశారు?
భారత క్రికెట్‌కు భవిష్యత్ కేంద్రంగా నిలిచే కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) అంకురార్పణ చేసింది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగర శివార్లలో సువిశాల స్థలంలో కొత్త ఎన్‌సీఏను బోర్డు నిర్మించనుంది. దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఫిబ్రవరి 14న జరిగింది. బీసీసీఐ బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు గంగూలీ, జై షాలతో పాటు ఆఫీస్ బేరర్లు అరుణ్ ధుమాల్, జయేశ్ జార్జ్, ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
చిన్నస్వామి స్టేడియం ఏ నగరంలో ఉంది?
2000 సంవత్సరం నుంచి బెంగళూరు నగరం మధ్యలో ఉన్న చిన్నస్వామి స్టేడియం ప్రాంగణంలోనే ఎన్‌సీఏ కొనసాగుతోంది. అక్కడ పరిమిత సౌకర్యాల మధ్యనే అకాడమీ కొనసాగింది. కొత్తగా నిర్మించబోయే ఎన్‌సీఏలో ప్రపంచస్థాయి అత్యుత్తమ సౌకర్యాలతో పాటు దేశవాళీ మ్యాచ్‌లు కూడా నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఏడాదిలోగా ఎన్‌సీఏ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది.
Mahabharat’s Bheem: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన భారత అథ్లెట్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : బీసీసీఐ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్