Mahabharat’s Bheem: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన భారత అథ్లెట్?
దిగ్గజ క్రీడాకారుడు, నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్టీ(74) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో డిస్కస్ త్రో, హ్యామర్ త్రో ఈవెంట్లలో పతకాలు నెగ్గిన ప్రవీణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పంజాబ్ రాష్ట్రం, టార్న్ తరణ్ జిల్లా, సర్హలి కలాన్ పట్టణంలో 1947, డిసెంబర్ 6న ఆయన జన్మించారు.
ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం..
- ప్రవీణ్ 1960 నుంచి 1974 వరకు పలు మెగా ఈవెంట్లలో పతకాలతో మెరిశారు.
- 1966 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో చాంపియన్‌గా నిలిచి స్వర్ణం సాధించిన ప్రవీణ్ హ్యామర్ త్రోలో కాంస్యం నెగ్గారు.
- 1966 ఏడాది కింగ్‌స్టన్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో హ్యామర్ త్రోలో రజతం గెలుపొందారు.
- 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రో ఈవెంట్‌లో టైటిల్ నిలబెట్టుకున్న ప్రవీణ్ 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో రజతం గెలిచారు.
- 1968 మెక్సికో, 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ ప్రవీణ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
భారతంలో భీముడు
దూరదర్శన్‌లో 90వ దశకంలో ప్రసారమైన సుప్రసిద్ధ పౌరాణిక ధారావాహిక ‘మహాభారత్’లో పంచ పాండవుల్లో భీముడిగా ప్రవీణ్ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తదనంతరం పలు హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించారు. 2013లో రాజకీయాల్లోనూ ప్రవేశించి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలోని వాజిర్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు.
చదవండి: స్ట్రాండ్‌జా స్మారక టోర్నీని ఏ దేశంలో నిర్వహించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దిగ్గజ అథ్లెట్, నటుడు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ప్రవీణ్ కుమార్ సోబ్టీ(74)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : గుండెపోటు కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్