Boxing: స్ట్రాండ్‌జా స్మారక టోర్నీని ఏ దేశంలో నిర్వహించనున్నారు?
ప్రతిష్టాత్మక స్ట్రాండ్‌జా స్మారక బాక్సింగ్ టోర్నీ–2022లో పాల్గొనే భారత మహిళల జట్టులో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ (52 కేజీలు) ఎంపికైంది. బల్గేరియాలో 2022, ఫిబ్రవరి 18 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 12 కేటగిరీల్లోనూ భారత్ తరఫున జాతీయ చాంపియన్స్ బరిలోకి దిగనున్నారు. నీతూ (48 కేజీలు), అనామిక (50), శిక్ష (54), సోనియా (57), మీనా (60), పర్వీన్ (63), అంజలి (66), అరుంధతి (71), సవిటీ (75), పూజా రాణి (81), నందిని (ప్లస్ 81 కేజీలు) పోటీపడతారు.
మహిళల ఐపీఎల్..
2023 ఏడాది మహిళల కోసం పూర్తి స్థాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్‌ను నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. 2022 ఏడాదికి మాత్రం ఎప్పటిలాగే మూడు జట్లతో మహిళల టి20 చాలెంజ్ మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా 2021 ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించలేదు.
చదవండి: ఇండోర్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయురాలు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్