Skip to main content

Archery: ఇండోర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయురాలు?

Jyothi Surekha Vennam at

లాన్‌కాస్టర్‌ క్లాసిక్‌ అంతర్జాతీయ ఇండోర్‌ ఆర్చరీ టోర్నమెంట్‌–2022లో భారత స్టార్‌ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ ఇండోర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల ఓపెన్‌ ప్రొ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో పోటీపడింది. జాతీయ పోటీల్లో పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించే సురేఖ ఫైనల్లో 131–129 పాయింట్ల తేడాతో పేజ్‌ పియర్స్‌ (అమెరికా)పై విజయం సాధించి చాంపియన్‌గా అవతరించింది. విజయవాడకు చెందిన సురేఖ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 660 పాయింట్లకుగాను 653 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది.

చ‌ద‌వండి: ఆసియా కప్‌ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ–2022 విజేత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ ఇండోర్‌ ఆర్చరీ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ ఆర్చర్‌?
ఎప్పుడు : జనవరి 30
ఎవరు    : వెన్నం జ్యోతి సురేఖ
ఎక్కడ    : పెన్సిల్వేనియా, అమెరికా
ఎందుకు : లాన్‌కాస్టర్‌ క్లాసిక్‌ అంతర్జాతీయ ఇండోర్‌ ఆర్చరీ టోర్నమెంట్‌–2022లో సురేఖ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 08 Feb 2022 01:54PM

Photo Stories