Skip to main content

Asian Football Confederation: ఆసియా కప్‌ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత?

AFC Asian Cup 2022

2022 AFC Women's Asian Cup: ఆసియా కప్‌ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ–2022లో చైనా జట్టు విజేతగా నిలిచింది. మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో ఫిబ్రవరి 6న జరిగిన ఫైనల్లో చైనా పీఆర్ 3–2తో దక్షిణ కొరియాను ఓడించి, టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో 2006 తర్వాత మళ్లీ చైనా ఆసియా టైటిల్‌ను గెలిచినట్లయింది. ఆసియా చాంపియన్‌గా చైనా నిలువడం ఇది తొమ్మిదోసారి కావడం విశేషం. ఈ టోర్నీ ద్వారా చైనా, కొరియా, జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ 2023 ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత పొందాయి.

ప్రపంచంలోనే పెద్ద ఇగ్లూను ఎక్కడ ఏర్పాటు చేశారు?

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని గుల్మార్గ్‌ పట్టణం సమీపంలోని ఇగ్లూ (మంచు) కఫే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వెడల్పున్న ఈ కఫే 40 మందికి ఆతిథ్యమివ్వగలదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇగ్లూ కఫే అని ఓనర్‌ సయ్యద్‌ వసీం షా తెలిపారు. 10 టేబుళ్లతో 40 మంది కూచునేలా.. దీన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

చ‌ద‌వండి: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 టోర్నమెంట్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా కప్‌ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ–2022లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు    : చైనా పీఆర్
ఎక్కడ    : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు  : ఫైనల్లో చైనా 3–2తో దక్షిణ కొరియాను ఓడించినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Feb 2022 05:01PM

Photo Stories