T20 World Cup 2022 Semi Final : సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్..! పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో..
పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో..
న్యూజిలాండ్‌తో పాటు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు కూడా ఏడు పాయింట్లు సాధించే వీలుంది. కానీ మెరుగైన రన్‌రేట్ ఉన్న కివీస్ సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. గ్రూపు-1 నుంచి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు +2.113 రన్ రేట్ ఉంది.
కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ విలియమ్సన్ మాత్రం..
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ విలియమ్సన్ 61 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అలెన్(32), మిచెల్(31) పరుగులతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో లిటిల్ మూడు, డెలానీ, అడైర్ తలా వికెట్ సాధించారు.
మూడు వికెట్లతో చెలరేగిన..
186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు ఓపెనర్లు స్టిర్లింగ్, బాల్బిర్నీ అద్భతమైన శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటయ్యక వరుస క్రమంలో ఐర్లాండ్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్, సోధి, సౌథీ తలా వికెట్ సాధించారు.
T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్-2022 విజేత, రన్నరప్ టీమ్‌లకు ప్రైజ్‌మనీ ఎంతంటే..?