T20 World Cup 2022 Final : టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్.. భారత్ ఇంటికి..
అడిలైడ్ వేదికగా నవంబర్ 10వ తేదీన (గురువారం) జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా.. బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్లు తమ జట్టుకు విజయం అందించారు.
T20 World Cup 2022 Prize Money : టీ20 ప్రపంచకప్-2022 విజేత, రన్నరప్ టీమ్‌లకు ప్రైజ్‌మనీ ఎంతంటే..?
టీమిండియాకు మొదటి ఓవర్లోనే..
టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(5) పూర్తిగా నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే అతడు అవుటయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మరో ఓపెనర్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఆచితూచి ఆడగా.. పవర్ ప్లేలో భారత జట్టు వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అతి జాగ్రత్తగా..
ఇక ఇక 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కోహ్లి 40 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. మిడిలార్డర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు మాత్రమే చేసి అవుట్‌కాగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దాటిగా ఆడాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అతడు 63 పరుగులు సాధించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(6) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన టీమిండియా 168 పరుగులు చేసింది.
Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?
ఆ ఇద్దరే గెలిపించారు..
లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. భారత బౌలర్లు ఏ దశలోనూ ఈ జంటను విడగొట్టలేకపోయారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ బౌలర్‌ను బరిలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. హేల్స్ 86, బట్లర్ 80 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇలా భారత్‌ను ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడించిన బట్లర్ బృందం ఫైనల్‌కు చేరుకుంది. కాగా నవంబరు 13 నాటి ఫైనల్లో ఇంగ్లండ్.. పాకిస్తాన్‌తో తలపడనుంది.
T20 World Highlights 2022 : న్యూజిలాండ్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్.. 13 ఏళ్ల తర్వాత..
మ్యాచ్ స్కోర్లు:
భారత్: 168/6 (20)
ఇంగ్లండ్: 170/0 (16)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అలెక్స్ హేల్స్